
ఆయనే మోకాలడ్డుతున్నాడు..
టీ20 ప్రపంచకప్‌ను ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేదని ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడానికి ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహరే కారణమని బీసీసీఐ భావిస్తోంది. టీ20 వరల్డ్‌కప్ రద్దయితే ఐపీఎల్‌కు మార్గం సుగమం కానుంది. కానీ, భారత బోర్డు ప్రయోజనాలను దెబ్బ తీయడానికే కంకణం కట్టుకున్న మనోహర్.. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మోకాలడ్డుతున్నాడని మండిపడుతోంది.

నెలరోజులు అవసరమా..?
భారతీయుడై ఉండి ఇప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగానే ఆయన పని చేస్తున్నారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి విమర్శించారు. ఈ కారణంగా ఐపీఎల్ సన్నాహకాలు తీవ్రంగా దెబ్బతింటాయని వాపోయారు. ‘త్వరలో పదవీకాలం ముగిసిపోయే శశాంక్ మనోహర్ లేని గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ నిర్వహించడం తమ వల్ల కాదని ఆస్ట్రేలియా చేతులెత్తేసిన తర్వాత దానిని ప్రకటించేందుకు నెల రోజులు కావాలా? మనోహర్.. డబ్బు కోసం బీసీసీఐని నిలువరించాలనుకుంటున్నారా? 'అని ఆ అధికారి ప్రశ్నించారు.

తేల్చేయవచ్చు కదా..
టీ20 వరల్డ్‌కప్ భవితవ్యం తేల్చడానికి ఈనెల ఆరంభంలో ఐసీసీ బోర్డు సమావేశమైంది. కానీ, నిర్ణయాన్ని మరో నెల వాయిదా వేసింది. అయితే, ఐసీసీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటే.. సభ్య దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఏర్పాటు చేసుకొనేందుకు ఉపయోగపడుతుందని ఆ అధికారి అన్నారు. ‘ఏదో ఒకటి తేల్చేయవచ్చు కదా. ఇది ఒక్క ఐపీఎల్ గురించే కాదు. ఈ ఆలస్యం అన్ని దేశాలకు సమస్యగా మారింది. బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేసిన మనోహర్ ఐసీసీలో మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తినేలా పని చేశారు. ఆయన కారణంగానే ఐసీసీ రెవెన్యూలో భారీ వాటాను బీసీసీఐ కోల్పోయింది. అయినా ఐసీసీ సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక గురించి ఇంకా ఎందుకు ప్రకటించడం లేదు' అని సదరు అధికారి ప్రశ్నించారు. మనోహర్ చైర్మన్ పదవిని వదిలేటట్టు కనిపించడం లేదన్నారు.

సెప్టెంబర్‌లో ఐపీఎల్..
ఇక ప్రపంచ క్రికెట్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఐపీఎల్‌కు లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తుంది. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన టీ20 ప్రపంచక్‌పపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సందేహం వ్యక్తం చేస్తుండడంతో ఐపీఎల్ నిర్వహణకున్న అడ్డంకులన్నీ తొలగినట్టే కనిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే సెప్టెంబరులోనే అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఈ ధనాధన్ లీగ్ సిద్ధం కాబోతోంది. ప్రస్తుతానికి సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు విండోను బీసీసీఐ ఖాయం చేసింది.
క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్.. మూడు జట్లతో 36 ఓవర్ల మ్యాచ్!


Click it and Unblock the Notifications












