Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: కోహ్లీ, అశ్విన్‌ ఫిర్యాదు.. నాణ్యతను పరిశీలించండని బీసీసీఐ ఆదేశం!!

BCCI asks SG ball makers to recheck quality after complaint from Virat Kohli

ముంబై: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఉపయోగించిన ఎస్‌జీ బాల్స్‌ నాణ్యతను సమీక్షించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా ఆ తయారీ సంస్థ యాజమాన్యాన్ని కోరింది. తొలి టెస్టు తర్వాత భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆ బంతులు సరిగ్గా లేవని బీసీసీఐ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో బీసీసీఐ తమను సంప్రదించిందని ఎస్‌జీ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ పరాస్‌ ఆనంద్‌ మీడియాకు తెలిపారు.

అవసరమైన మార్పులు చేస్తాం

అవసరమైన మార్పులు చేస్తాం

ఎస్‌జీ బాల్స్‌ గురించి తమకొచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని, పలువురు ఆటగాళ్లు కూడా పిచ్‌ గురించి ఫిర్యాదులు చేశారని ఎస్‌జీ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ పరాస్ ఆనంద్‌ పేర్కొన్నారు. చెన్నై లాంటి పిచ్‌లపై బంతి ఎలా స్పందిస్తుందనే విషయాలను తాము తెలుసుకుంటామన్నారు. తమ రీసెర్చ్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ బృందం వాటిని పూర్తిగా పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తామని చెప్పారు. ఎస్‌జీ బంతులతో ఇప్పటికే ఓసారి మార్పులు చేసిన విషయం తెలిసిందే.

ఇలాంటి బంతిని ఏ జట్టు కోరుకోదు

ఇలాంటి బంతిని ఏ జట్టు కోరుకోదు

తొలి టెస్టు ముగిశాక విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఎస్‌జీ బంతి నాణ్యత సంతృప్తికరంగా లేదు. గతంలో ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 60 ఓవర్లకే బంతి పూర్తిగా దెబ్బతింటోంది. టెస్టుల్లో ఇలాంటి బంతిని ఏ జట్టు కోరుకోదు' అని అన్నాడు. కోహ్లీ గతంలోనూ ఒకసారి ఎస్‌జీ బాల్స్‌పై ఫిర్యాదు చేశాడు. 2018 అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా బంతి నాణ్యత బాగోలేదని చెప్పాడు. చెన్నై టెస్టులో కుట్లు పోయి బంతిపై సీమ్​ మృదువుగా మారడం వల్ల బంతిని మార్చాలని భరత బౌలర్లు చేసిన విజ్ఞప్తిని అంపైర్లు నితిన్​ మీనన్​, అనిల్ చౌదరి తిరస్కరించారు.

ఎస్‌జీ బాల్స్‌ను ఎప్పుడూ ఇలా చూడలేదు

ఎస్‌జీ బాల్స్‌ను ఎప్పుడూ ఇలా చూడలేదు

40 ఓవర్లు ముగిసేసరికి బంతి చీలిపోవడం వింతగా ఉందని ఆర్ అశ్విన్ మ్యాచ్​​ నాల్గో రోజు అనంతరం అన్నాడు. 'ఎస్‌జీ బంతి సీమ్​ దగ్గర చీలిపోవడం నేనెప్పడూ చూడలేదు. తొలి రెండు రోజులు పిచ్​ గట్టిగా ఉండటమే అందుకు కారణం కావొచ్చు. అయితే రెండో ఇన్నింగ్స్​లో 40-50 ఓవర్లకే బంతి అలాంటి స్థితికి చేరుకోవడం వింతగా అనిపిస్తోంది. బంతి అలా కావడానికి అసలు కారణం ఏంటన్న దానికి సిరీస్​లో సమాధానం లభిస్తుంది' అని​ అన్నాడు. కూకబురా బంతి తయారీకి యంత్రాలను ఉపయోగిస్తారు. ఎస్జీ బంతిని సీమ్​ను చేతితో కుడతారు.

కొన్నేళ్లుగా ఎస్‌జీ బంతులపై విమర్శలు

కొన్నేళ్లుగా ఎస్‌జీ బంతులపై విమర్శలు

కూకబురా బంతి తయారీకి యంత్రాలను ఉపయోగిస్తారు. ఎస్‌జీ బంతిని సీమ్​ను చేతితో కుడతారు. అందుకే సీమ్​ ఉబ్బెత్తుగా ఉంటుంది. కొన్నేళ్లుగా ఆటగాళ్లు ఎస్‌జీ బంతులపై విమర్శలు చేస్తున్నారు. 2018లో ఆటగాళ్ల సూచనల మేరకు మార్పులు చేశారు. ఆ తర్వాత 2019లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ సిరీస్​లో మార్పులతో తీసుకొచ్చిన బంతులను ఉపయోగించారు. ప్రస్తుతం అవే బంతులనే ఇంగ్లడ్​తో సిరీస్​లో వాడుతున్నారు. ​

'రహానే ఏమాత్రం ఫుట్‌వర్క్ లేకుండా ఆడాడు.. అతడిలో పోరాటపటిమే కనబడలేదు'

Story first published: Thursday, February 11, 2021, 14:08 [IST]
Other articles published on Feb 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+