Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.. బీసీసీఐ కీలక నిర్ణయం!

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ ఆటగాళ్లు ఈ నిబంధనను తప్పుబడుతుండటంతో ఐపీఎల్ 2027 సీజన్‌లో ఈ రూల్ కొనసాగించాలా? వద్దా? అనే విషయాన్ని తేల్చుకోవాలని ఫ్రాంచైజీలకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై పది ఫ్రాంచైజీల అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. ఈ రూల్‌ను పున:సమీక్షిస్తామని కొన్నాళ్ల క్రితమే బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ కార్యకలాపాలపై విస్తృత స్థాయి అభిప్రాయ సేకరణ చేపట్టిన బీసీసీఐ.. అందులో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కూడా చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. నేటి(ఆగస్ట్ 31)లోపు ఫ్రాంచైజీలు తమ అభిప్రాయాలను సమర్పించాల్సి ఉంది.

IPL 2027: కోచ్‌గా యువరాజ్ సింగ్ అరంగేట్రం.. కళ్లుచెదిరే పారితోషకం!

IPL 2027: కోచ్‌గా యువరాజ్ సింగ్ అరంగేట్రం.. కళ్లుచెదిరే పారితోషకం!

ఫ్రాంచైజీల అభిప్రాయంపైనే..

ఈ రూల్‌తో పాటు ఐపీఎల్‌కు సంబంధించిన పలు అంశాలపై ఫ్రాంచైజీల అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు, మ్యాచ్ అఫిషియల్స్ ప్రాంతం విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించడం.. కమ్యూనికేషన్ కోసం మొబైల్స్ వాడకంపై నిషేధం కొనసాగించాలా? ఎత్తి వేయాలా? అనేదానిపై బోర్డు చర్చించనుంది.

BCCI Asks IPL Franchises for Feedback on Impact Player Rule Ahead of IPL 2027 Season

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కొనసాగించాలా? వద్దా? అనేది ఫ్రాంచైజీల అభిప్రాయంపై ఆధారపడి ఉంది. వాస్తవానికి ఐపీఎల్ 2027 సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కొనసాగించాలని బీసీసీఐ భావించింది. కానీ పలు జట్ల కెప్టెన్లు ఈ రూల్‌ను తప్పుబట్టడంతో సమీక్షిస్తామని పేర్కొంది. సెప్టెంబర్‌లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఈ అంశాలపై చర్చ జరగనుంది.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎంటంటే? ఎందుకీ రచ్చ?

మూడేళ్ల క్రితం ఐపీఎల్ 2024 సీజన్‌లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టింది. ఈ రూల్ వల్ల అదనంగా ఓ బ్యాటర్/ బౌలర్‌ తీసుకునే అవకాశం జట్లకు లభించింది. ముఖ్యంగా భారత ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ రూల్‌ను తీసుకొచ్చింది. బీసీసీఐ సదుద్దేశంతో తెచ్చినా.. ఈ రూల్ కారణంగా ఆట స్వభావం మారిపోతుందనే వాదన వినిపిస్తోంది.

Asian Games 2026: టెంట్స్‌లో డ్రెస్సింగ్ రూమ్స్.. పక్కనే వాష్ రూమ్స్! పునరాలోచనలో బీసీసీఐ

Also Read

Asian Games 2026: టెంట్స్‌లో డ్రెస్సింగ్ రూమ్స్.. పక్కనే వాష్ రూమ్స్! పునరాలోచనలో బీసీసీఐ

మరీ ముఖ్యంగా ఈ రూల్ కారణంగా ఆల్‌రౌండర్ల పాత్ర తగ్గిపోయిందని, 12 మందితో ఆడినట్లు అవుతుందనే విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఈ రూల్‌ను తప్పుబట్టారు. అంతేకాకుండా ప్రతీ జట్టు అలవోకగా 200+ పరుగులు చేయడం.. భారీ స్కోర్లు చేసినా కాపాడుకోలేని పరిస్థితి ఉండటంతో ఈ రూల్‌పై పునరాలోచన చేయాలనే డిమాండ్ వ్యక్తమైంది.

Story first published: Monday, August 31, 2026, 13:49 [IST]
Other articles published on Aug 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+