IND vs AFG: టీమిండియాలోకి కొత్త కోచ్!
టీమిండియా నయా స్పిన్ కోచ్‌గా మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులేను నియమితులయ్యాడు. అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌కు ముందు సాయిరాజ్ బహుతులే టీమిండియా స్పిన్ కోచ్‌గా బాధ్యతలు చేపడుతారని బీసీసీఐ మంగళవారం(జూన్ 2) అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు స్పిన్ కోచ్‌గా పనిచేసి సాయిరాజ్ బహుతులేకు ఆటగాడిగా.. కోచ్‌గా విశేష అనుభవం ఉంది. టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అయిన సాయిరాజ్ బహుతులేకు యువ స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను మెరుపర్చడంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
కోచ్‌గా అపారమైన అనుభవం..
ఈ నేపథ్యంలోనే భారత జట్టు స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ తరఫున బహుతులే రెండు టెస్ట్‌లు, 8 వన్డేలు ఆడాడు. రెండు దశాబ్దాల పాటు సాగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 6176 పరుగులు చేసి 630 వికెట్లు పడగొట్టాడు. విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ దేశవాళీ జట్లకు హెడ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా బహుతులేకు ఉంది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌కు సుదీర్ఘంగా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.

అండర్ 19 కోచ్‌గా..
2022లో ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2024 అండర్ 19 ప్రపంచకప్‌లో కూడా సపోర్ట్ స్టాప్ మెంబర్‌గా ఉన్నాడు. భారత్-ఏ, సీనియర్ జట్లతో పలు పర్యాయాలు ప్రత్యేక బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. 2021- 2024 వరకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో కోచ్‌గా పనిచేశాడు.
తన నియామకంపై సాయిరాజ్ బహుతులే హర్షం వ్యక్తం చేశాడు. భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపికవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. ఆటగాడిగా దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎంత గర్వకారణమో.. కోచ్‌గా సేవలందించడం కూడా అంతే ప్రత్యేకమని తెలిపాడు. జూన్ 6 నుంచి న్యూచంఢీఘర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో టీమిండియా ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications