న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్ ఎవరంటే..?

BCCI Appoints India New Vice Captain As KL Rahul And Rohit Sharma As Captain

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రమోషన్ అందుకోవడంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ శకం ముగిసింది. రోహిత్ శర్మనే టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌గా కొనసాగుతాడని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ ప్రకటనలో విరాట్ కోహ్లీ పేరును కూడా ప్రస్తావించలేదు. అయితే 2023 వన్డే ప్రపంచకప్ వరకు కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగాలనుకున్నా.. ఫార్మాట్‌కో కెప్టెన్ భారత్‌కు సెట్ అవ్వదని భావించిన బీసీసీఐ అతన్ని సారథ్య బాధ్యతలు తప్పించింది.

దాంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. రోహిత్ కెప్టెన్ కావడంతో వైస్ కెప్టెన్ ఎవరా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్‌తో పాటు రిషభ్ పంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

వన్డే టీమ్ ప్రకటించేటప్పుడు..

వన్డే టీమ్ ప్రకటించేటప్పుడు..

అయితే రోహిత్ మాదిరే.. వైస్ కెప్టెన్సీ పదవి కేఎల్ రాహుల్‌నే వరించినట్లు తెలుస్తోంది. రోహిత్‌కు డిప్యూటీగా అతడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వన్డే వైస్‌ కెప్టెన్‌ రేసులో రిషభ్‌ పంత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ.. ఈ యువ ఆటగాడికి ఇప్పుడే ఆ బాధ్యతలు అప్పజెప్పడం తొందరపాటు నిర్ణయం అవుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సౌతాఫ్రికా పర్యటనతో రాహుల్ పూర్తిస్థాయి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరిస్తాడని, దీనికి సంబంధించిన ప్రకటన వన్డే టీమ్ సెలెక్షన్ సందర్భంగా వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌ వెబ్‌సైట్‌కు తెలిపారు.

పంత్ చిన్నోడే..

పంత్ చిన్నోడే..

'కేఎల్‌ రాహులే తర్వాతి వైస్‌ కెప్టెన్‌. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌కు డిప్యూటీగా మరో ఛాయిస్‌ లేదు. కాబట్టి సుదీర్ఘకాలంగా వైట్‌ బాల్‌ క్రికెట్‌లో అదరగొడుతున్న కేఎల్‌ రాహుల్‌ వైపే మొగ్గుచూపడం సహజం. సమీప కాలంలో తను కెప్టెన్‌గా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రోహిత్‌, విరాట్‌, ద్రవిడ్‌ మార్గదర్శనంలో తను మరో స్థాయికి ఎదుగుతాడు.

రిషభ్‌ పంత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ అతను చాలా చిన్నవాడు. ఇప్పుడే అతనికి అంత పెద్ద బాధ్యతలు అప్పగిస్తే ఒత్తిడికి గురవుతాడు. సీనియర్ల నుంచి అతను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కెప్టెన్‌ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించడం తనకు తలమించిన భారం అవుతుందనేది మా అభిప్రాయం.'అని సదరు అధికారి చెప్పుకొచ్చారు.

రాహులే ఎందుకంటే..?

రాహులే ఎందుకంటే..?

ఇక కేఎల్ రాహులే తదుపరి వైస్ కెప్టెన్ ఎందుకు అవుతాడంటే.. ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత రాహుల్‌ అన్ని ఫార్మాట్లలో ఆడగలిగే ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతానికి వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌ కంటే మంచి రికార్డు ఉన్న ఆటగాడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ పంజాబ్‌ కింగ్స్‌కు సారథిగా వ్యవహరించిన రాహుల్‌... గత రెండేళ్లలో అంతర్జాతీయ వన్డేల్లో సాధించిన సగటు 61.92. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్‌ వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. సీనియర్లు కోహ్లీ, రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌తో ఈ కర్ణాటక వికెట్‌ కీపర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.

Story first published: Thursday, December 9, 2021, 14:46 [IST]
Other articles published on Dec 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X