న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమానులకు పండగే.. రెండేళ్లు నాన్‌స్టాప్ క్రికెట్! మూడు ప్రపంచకప్‌లు! టీమిండియా షెడ్యూల్‌ ఇదే!

BCCI announces Team India schedule from 2021 to 2023, Here is full list
BCCI Announces Indian Cricket Team's Schedule From 2021-2023

ముంబై: గత ఏడాది కరోనా వైరస్ మహమ్మారి క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఎందుకంటే వైరస్ కారణంగా చాలా వ‌ర‌కు క్రికెట్ టోర్నీలు రద్దు అయ్యాయి. కరోనా ప్రభావం ఆర్ధికంగా చాలా క్రికెట్ బోర్డులపై పడింది. చివరకు బయో బబుల్ వాతావరణం సృష్టించి మ్యాచులు నిర్వహించారు. టీమిండియా అయితే మార్చి నుంచి నవంబర్ చివరి వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు. అయితే సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ వరకు ఐపీఎల్ 2020ని మాత్రం భారత ఆటగాళ్లు ఆడారు. ఆపై ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనకు వెళ్లిన భారత్.. ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. దాదాపు ఏడాది తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్ల పాటు నాన్‌స్టాప్‌ క్రికెట్

రెండేళ్ల పాటు నాన్‌స్టాప్‌ క్రికెట్

అభిమానులను భారత జట్టు రెండేళ్ల పాటు నాన్‌స్టాప్‌గా అల‌రించ‌నున్న‌ది. 2021-2023 వ‌ర‌కు సంబంధించిన టీమిండియా షెడ్యూల్‌ను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) తాజాగా రిలీజ్ చేసింది. 2022లో ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌నున్న ప్రపంచకప్‌ వ‌ర‌కు.. దాదాపు 15 నెల‌ల పాటు బ్రేక్ లేకుండా కోహ్లీ సేన క్రికెట్ ఆడ‌నున్న‌ది. అయితే గత ఏడాది కరోనా వ‌ల్ల ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ టోర్నీ రద్దు అయిన విష‌యం తెలిసిందే. దీంతో 2021 నుంచి 2023 వ‌ర‌కు మూడు ప్రపంచకప్ టోర్నీలు జ‌ర‌గ‌నున్నాయి. ఓసారి టీమిండియా షెడ్యూల్‌ పరిశీలిద్దాం.

2021 షెడ్యూల్‌

2021 షెడ్యూల్‌

ఏప్రిల్ నుంచి మే 2021 వ‌ర‌కు ఐపీఎల్‌.

జూన్ నుంచి జూలై 2021 వ‌ర‌కు వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌, భారత్ vs శ్రీలంక‌ (3వ‌న్డేలు, 5టీ20లు), ఆసియా క‌ప్

జూలై 2021లో భారత్ vs జింబాబ్వే (3వ‌న్డేలు)

జూలై నుంచి సెప్టెంబ‌ర్ 2021 వ‌ర‌కు భారత్ vs ఇంగ్లండ్ (5 టెస్టులు)

అక్టోబ‌ర్ 2021లో భారత్ vs సౌతాఫ్రికా (3 వ‌న్డేలు, 5టీ20లు)

2021 అక్టోబ‌ర్ నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు ఐసీసీ టీ20 ప్రపంచకప్

న‌వంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ 21 వ‌ర‌కు భారత్ vs న్యూజిలాండ్‌ (2టెస్టులు, 3టీ2ఏలు), భారత్ vs సౌతాఫ్రికా (3టెస్టులు, 3టీ20లు)

2022 షెడ్యూల్‌

2022 షెడ్యూల్‌

జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు భారత్ vs వెస్టిండీస్‌ (3వ‌న్డేలు, 3టీ20లు), భారత్ vs శ్రీలంక‌ (3టెస్టులు, 3 టీ20లు)

ఏప్రిల్ నుంచి మే వ‌ర‌కు ఐపీఎల్ 2022

జూలై నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు భారత్ vs ఇంగ్లండ్ ‌(3వ‌న్డేలు, 3 టీ20లు), భారత్ vs వెస్టిండీస్ ‌(3వ‌న్డేలు,3టీ20లు)

సెప్టెంబ‌ర్‌లో ఆసియా క‌ప్

అక్టోబ‌ర్ నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 ప్రపంచకప్

న‌వంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు భారత్ vs బంగ్లాదేశ్‌(2 టెస్టులు, 3టీ20లు), భారత్ vs శ్రీలంక‌ (5వ‌న్డేలు)

2023 షెడ్యూల్

2023 షెడ్యూల్

జ‌న‌వ‌రిలో భారత్ vs న్యూజిలాండ్ ‌(3వ‌న్డేలు, 3టీ20లు)

ఫిబ్ర‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు భారత్ vs ఆస్ట్రేలియా (4టెస్టులు, 3వ‌న్డేలు, 3టీ20లు)

ఏప్రిల్ నుంచి మే వ‌ర‌కు ఐపీఎల్ 2023

అక్టోబ‌ర్ నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్

సిక్సర్‌తో రూట్ ద్విశతకం.. రెండో విదేశీ కెప్టెన్‌గా రికార్డు! 450 దాటిన ఇంగ్లండ్ స్కోర్!

Story first published: Saturday, February 6, 2021, 15:35 [IST]
Other articles published on Feb 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X