హర్మన్ ప్రీత్ X మిథాలీ రాజ్.. నవంబర్ 4 నుంచి మహిళల ఐపీఎల్ షురూ!

న్యూఢిల్లీ: మహిళల ఐపీఎల్ నయా ఎడిషన్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) క్లారిటీ ఇచ్చేసింది. నవంబరు 4 నుంచి 9 వరకు యూఏఈలో మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ పేరిట ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతీ ఏటా ఐపీఎల్ మధ్యలో మూడు జట్లతో కూడిన ఈ టోర్నీని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి జరగకపోవచ్చని అంతా భావించారు. కానీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలో హామీ ఇచ్చినట్టుగానే మహిళల ఐపీఎల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సారి ఫైనల్‌తో సహా మొత్తం నాలుగు మ్యాచ్‌లే జరగనున్నాయి.

బిగ్ బాష్ లీగ్ ఉండటంతో...
ఇక సూపర్ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రెయిల్ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ క్రీడాకారిణులు పాల్గొంటారు. అయితే ఇదే సమయానికి మహిళల బిగ్‌బాష్ లీగ్ ఉండడంతో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌కు చెందిన స్టార్ క్రికెటర్లు మాత్రం ఆడబోవడం లేదు. థాయ్‌లాండ్ నుంచి తొలిసారిగా నథకన్ ఛాంతమ్‌కు చోటు దక్కింది.
గత ఎడిషన్ ఫైనలిస్ట్‌లు సూపర్ నోవాస్, వెలాసిటీ జట్ల మధ్య నాలుగో తేదీన జరిగే మ్యాచ్‌తో లీగ్ మొదలవుతుంది. పురుష క్రికెటర్లు పాటించిన ప్రొటోకాల్సే మహిళలు పాటించనున్నారు. యూఏఈ వేదికగా నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.

షెడ్యూల్
నవంబరు 4: సూపర్‌నోవాస్ X వెలాసిటీ (రాత్రి 7.30)
నవంబరు 5: వెలాసిటీ X ట్రెయిల్ బ్లేజర్స్ (మ. 3.30)
నవంబరు 7 : ట్రెయిల్‌బ్లేజర్స్ X సూపర్‌నోవాస్ (రాత్రి 7.30)
నవంబరు 9 : ఫైనల్ (రాత్రి 7.30)

జట్ల వివరాలు:
సూపర్ నోవాస్: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, చమరి ఆటపట్టు, ప్రియా పునియా, అనుజా పాటిల్, రాధా యాదవ్, తానియా భాటియా(కీపర్), శశికళ సిరివర్దనే, పూనమ్ యాదవ్, షకేరా సెల్మాన్, అరుంధతి రెడ్డీ, పూజా వస్త్రాకర్, అయూషి సోని, అయభోంగా ఖాక, ముస్కన్ మాలిక్
ట్రెయిల్ బ్లేజర్స్:స్మృతీ మంధాన(కెప్టెన్), దీప్తీ శర్మ, పూనమ్ రౌత్, రిచా ఘోష్, హేమలత, నుజాత్ పర్వీన్(కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, హర్లీన్ డియోల్, జూలన్ గోస్వామి, సిమరన్ దిల్ బహదుర్, సల్మాన్ ఖాతున్, సోఫీ ఎక్‌లెస్టోన్, నత్తకన్ చాంతమ్, డియాండ్రా డాటిన్, కాశీవ్ గౌతమ్
వెలాసిటీ: మిథాలీ రాజ్(కెప్టెన్), వేద కృష్ణమూర్తి, షెఫాలీ వర్మ, సుష్మా వర్మ (కీపర్), ఎక్తా బిష్త్, మాన్సి జోషి, శిఖా పాండే, దేవికా వైద్య, సుశ్రీ దివ్యదర్శిని, మనాలి దక్షిణి, కాస్పెరెక్, డానియల్ వ్యాట్, సున్ లూస్, జహనార అలామ్, ఎమ్ అనఘ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications