రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ 2025 టోర్నీ 2025లో బరిలోకి దిగే భారత-ఏ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. టీమిండియా యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మను కెప్టెన్‌గా నియమించింది. నమన్ ధీర్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో పాటు ఐపీఎల్ స్టార్స్ ప్రియాన్ష్ ఆర్య, నెహాల్ వధేరా, రమణ్‌దీప్ సింగ్, సుయాష్ శర్మ చోటు దక్కించుకున్నారు. తెలుగు తేజం షేక్ రషీద్‌కు స్టాండ్‌బై ప్లేయర్ల జాబితాలో చోటు దక్కింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో జితేష్ శర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఫినిషర్‌గా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు కనబర్చి ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన జితేష్ శర్మ.. ఇటీవల హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లోనూ 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ వరుస ప్రదర్శనల నేపథ్యంలో భారత సెలెక్టర్లు అతనికి కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చారు.

ఈ ఎమర్జింగ్ స్టార్స్ టోర్నీ నవంబర్ 14 నుంచి 23 వరకు దోహా వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక ఏ జట్లతో పాటు అసోసియేట్ దేశాలైనా ఒమన్, యూఏఈ, హాంగ్ కాంగ్ కూడా బరిలోకి దిగనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండు గ్రూప్‌ల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ఆడనున్నాయి. సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్లు టైటిల్ పోరులో పాల్గొననున్నాయి. ఈ టోర్నీలో భాగంగా దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్‌లు మరోసారి తలపడబోతున్నాయి. పాకిస్థాన్, యూఏఈ, ఓమన్‌లతో భారత్ గ్రూప్-బీలో ఉంది.
తుది జట్లు: ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నెహాల్ వధేరా, నమన్ ధీర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షేడ్జ్, జితేష్ శర్మ (కెప్టెన్) (వికెట్ కీపర్), రమణ్దీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాక్, యుధ్వీర్ సింగ్ చారక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయష్ శర్మ.
స్టాండ్-బై ఆటగాళ్లు: గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుశాగ్ర, తనుష్ కొటియన్, సమీర్ రిజ్వీ, షేక్ రషీద్.