India vs Sri Lanka: టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. జట్లు ప్రకటించిన బీసీసీఐ! పుజారా, రహానేపై వేటు!

న్యూఢిల్లీ: సొంతగడ్డపై శ్రీలంకతో జరగనున్న మూడు టీ20లు, రెండు టెస్ట్ సిరీస్‌లకు సంబంధించిన భారత జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన రెండు వేర్వేరు జట్ల వివరాలను చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శనివారం వెల్లడించింది. అందరూ ఊహించినట్లుగానే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో అతనికి డిప్యూటిగా జస్‌ప్రీత్ బుమ్రాను నియమించింది. సౌతాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమైన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలతో పాటు సీనియర్ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహాలపై వేటు వేసింది.

కోహ్లీ, పంత్‌కు విశ్రాంతి..
మార్చి 4 నుంచి శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌తో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్నాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారని అంతా ఆతృతగా ఎదురు చూశారు. కొందరు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రాలకు సారథ్య బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. కానీ ఆలిండియా సెలెక్షన్ కమిటీ మాత్రం రోహిత్‌కే సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. ఫిట్‌నెస్ సమస్యలు, ఇతర కారణాలతో జట్టుకు దూరమైతే తప్పా.. మిగిలిన అన్ని సందర్భాల్లో అతనే కెప్టెన్‌గా ఉంటాడని సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ తెలిపాడు.

సంజూ శాంసన్‌కు చాన్స్....
ఫిబ్రవరి 24 నుంచి లక్నో, ధర్మశాల వేదికగా మూడు టీ20ల సిరీస్ జరగనుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్‌లకు విశ్రాంతినిచ్చారు. ఇషాన్ కిషన్ జట్టులో కొనసాగించగా.. అతనికి బ్యాకప్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించారు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, దీపక్ హుడాలను కొనసాగించారు. గాయంతో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌తో సిరీస్‌లకు దూరమైన రవీంద్ర జడేజా ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. విశ్రాంతిలో ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా కూడా తిరిగి వచ్చాడు.

కేఎస్ భరత్‌కు చోటు..
ఇక రెండు టెస్ట్‌ల సిరీస్‌కు మాత్రం రిషభ్ పంత్, కోహ్లీ అందుబాటులో ఉండనున్నారు. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో ప్రియాంక్ పాంచల్‌తో పాటు మాయంక్ అగర్వాల్‌కు అవకాశం దక్కింది. గాయంతో దూరమైన శుభ్‌మన్ గిల్, విశ్రాంతిలో ఉన్న మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. సౌరభ్ కుమార్‌కు తొలిసారి టీమిండియా పిలుపు లభించింది. అశ్విన్ కేవలం టెస్ట్ సిరీస్‌కు మాత్రమే ఎంపికయ్యాడు. అతను ఫిట్ నెస్ టెస్ట్ నెగ్గితేనే జట్టుతో చేరుతాడని చేతన్ శర్మ తెలిపాడు.

భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), ఆవేశ్ ఖాన్
భారత టెస్ట్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), ప్రియాంక్ పాంచల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హనుమ విహరి, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్(కీపర్), కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications