Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా హోమ్ షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌‌లో నో మ్యాచ్!

టీమిండియా హోమ్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఈ ఏడాది సొంతగడ్డపై ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను బుధవారం వెల్లడించింది. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌తో టీమిండియా హోమ్ సీజన్‌ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2 నుంచి 6 మధ్య తొలి టెస్ట్, అక్టోబర్ 10 నుంచి 14 మధ్య కోల్‌కతా వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.

అనంతరం సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. నవంబర్ 14-18 మధ్య న్యూఢిల్లీ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్‌ జరగనుండగా.. గువహతి వేదికగా నవంబర్ 22 నుంచి 26 మధ్య రెండో టెస్ట్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. రాయ్ పూర్ వేదికగా డిసెంబర్ 3న రెండో వన్డే, వైజాగ్ వేదికగా డిసెంబర్ 6న మూడో వన్డే జరగనుంది.

BCCI announces India s 2025 home season schedule No Match in Hyderabad

డిసెంబర్ 9 నుంచి 19 వరకు ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. కటక్ వేదికగా డిసెంబర్ 9న తొలి టీ20, 11న ఛండీఘర్ వేదికగా రెండో టీ20, 14న ధర్మశాలలో మూడో టీ20, లక్నో వేదికగా 17న నాలుగో టీ20, అహ్మదాబాద్ వేదికగా డిసెంబర్ 19న ఐదో టీ20 జరగనుంది. టీమిండియా హోమ్ షెడ్యూల్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు జరగనుండగా.. హైదరాబాద్‌కు ఒక్క మ్యాచ్ కేటాయించలేదు. వైజాగ్ వేదికగా మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ జరగనుంది. సౌతిండియా క్రికెట్ మైదానాల్లో వైజాగ్ మాత్రమే ఒక్క మ్యాచ్ కేటాయించారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం మైదానాలకు ఒక్క మ్యాచ్‌ కేటాయించలేదు.

టీమిండియా హోమ్ షెడ్యూల్..

వెస్టిండీస్:

తొలి టెస్ట్ - అక్టోబర్ 2 నుంచి 6 వరకు, అహ్మదాబాద్.
2వ టెస్ట్ - అక్టోబర్ 10 నుంచి 14 వరకు, కోల్‌కతా.

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్:

తొలి టెస్ట్ - నవంబర్ 14 నుంచి 18 వరకు, ఢిల్లీ.
రెండో టెస్ట్ - నవంబర్ 22 నుంచి 26 వరకు, గౌహతి.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్:

తొలి వన్డే - నవంబర్ 30, రాంచీ.
రెండో వన్డే - డిసెంబర్ 3, రాయ్‌పూర్.
మూడో వన్డే - డిసెంబర్ 6, వైజాగ్.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్:

తొలి టీ20 - డిసెంబర్ 9, కటక్.
రెండో టీ20 - డిసెంబర్ 11, చండీగఢ్.
మూడో టీ20 - డిసెంబర్ 14, ధర్మశాల.
నాలుగో టీ20 - డిసెంబర్ 17, లక్నో.
ఐదొ టీ20 - డిసెంబర్ 19, అహ్మదాబాద్.

Story first published: Wednesday, April 2, 2025, 19:52 [IST]
Other articles published on Apr 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+