హైదరాబాద్‌లో టీ20 మ్యాచ్.. టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్ ఇదే!
టీమిండియా హోమ్ సీజన్ 2024-25కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఈ సీజన్‌లో టీమిండియా సొంతగడ్డపై మూడు దేశాలతో తలపడనుంది. సెప్టెంబర్ చివరి వారంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌తో ప్రారంభమై.. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో టీమిండియా హోమ్ సీజన్ ముగియనుంది.
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024 ఆడుతున్న టీమిండియా.. ఈ టోర్నీ అనంతరం జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అనంతరం శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. సెప్టెంబర్ చివరి వారంలో భారత్‌కు బంగ్లాదేశ్ రానుండగా.. ఆ జట్టుతో రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు ఆడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరగనుంది.

అనంతరం అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌తో భారత హోమ్ సీజన్ ముగియనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ఈ హోమ్ సీజన్‌లో తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక్క మ్యాచ్ కేటాయించారు.
బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు
తొలి టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి 23, చెన్నై వేదికగా ఉదయం 9.30 గంటలకు
రెండో టెస్ట్: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1, కాన్పూర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు
తొలి టీ20: అక్టోబర్ 6, ధర్మశాల, రాత్రి 7 గంటలకు
రెండో టీ20: అక్టోబర్ 9, ఢిల్లీ, రాత్రి 7 గంటలకు
మూడో టీ20: అక్టోబర్ 12, హైదరాబాద్, రాత్రి 7 గంటలకు
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్..
తొలి టెస్ట్: అక్టోబర్ 16-20, బెంగళూరు, ఉదయం 9.30 గంటలకు
రెండో టెస్ట్: అక్టోబర్24- 28, పుణే, ఉదయం 9.30 గంటలకు
మూడో టెస్ట్: నవంబర్ 1 నుంచి 5, ముంబై, ఉదయం 9.30 గంటలకు

ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు
తొలి టీ20: జనవరి 22, చెన్నై, రాత్రి 7 గంటలకు
రెండో టీ20: జనవరి 25, కోల్‌కతా, రాత్రి 7 గంటలకు
మూడో టీ20: జనవరి 28, రాజ్‌కోట్, రాత్రి 7 గంటలకు
నాలుగో టీ20: జనవరి 31, పుణే, రాత్రి 7 గంటలకు
ఐదో టీ20: ఫిబ్రవరి 2, ముంబై, రాత్రి 7 గంటలకు
వన్డే సిరీస్
తొలి వన్డే: ఫిబ్రవరి 6, నాగ్‌పూర్, మధ్యాహ్నం 1.30 గంటలకు
రెండో వన్డే: ఫిబ్రవరి 9, కటక్, మధ్యాహ్నం 1.30 గంటలకు
మూడో వన్డే: ఫిబ్రవరి 12, అహ్మదాబాద్, మధ్యాహ్నం 1.30 గంటలకు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications