For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్స్.. కోహ్లీ, రోహిత్‌కు డిమోషన్!

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పురుషుల, మహిళా క్రికెటర్ల 2025-26 వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు డిమోషన్ లభించింది. అంతేకాకుండా నాలుగు కేటగిరీలను మూడు కేటగిరీలకు బీసీసీఐ కుదించింది. గత కాంట్రాక్టుల్లో ఏ ప్లస్ కేటగిరిలో కొనసాగిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ‌లు బీ కేటగిరికి డిమోట్ అయ్యారు.

అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాంతోనే ఈ ఇద్దరూ ఏ+ కేటగిరి నుంచి బీ కేటగిరికి డిమోట్ అయ్యారు. ఏ+ కేటగిరిని తొలగించిన బీసీసీఐ.. ఏ, బీ, సీ కేటగిరిల్లో భారత ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది.

30 మందికి ఛాన్స్..

మొత్తం 30 మంది పురుష ఆటగాళ్లు, 21 మంది మహిళా క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో చోటు దక్కింది. ఈ కాంట్రాక్టులు 2025 అక్టోబర్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయి. ఈ మేరకు సోమవారం బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే మూడు కేటగిరిల్లో ఆటగాళ్లకు ఏడాదికి ఎంత వార్షిక వేతనం అందుతుందో అనే వివరాలను బీసీసీఐ వెల్లడించలేదు.

గత కాంట్రాక్టుల ప్రకారం ఏ ప్లస్ ఆటగాళ్లకు ఏడు కోట్లు, ఏ కేటగిరి ప్లేయర్లకు రూ.5 కోట్లు, బీ కేటగిరి ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ కేటగిరి ప్లేయర్లుకు కోటీ వార్షిక వేతనం అందేది. మహిళా క్రికెటర్ల కాంట్రాక్టుల్లో తెలుగు తేజం శ్రీచరణికి తొలిసారి చోటు దక్కింది. ఈ కడప బిడ్డకు సీ కేటగిరి కాంట్రాక్టు లభించింది. పురుషుల క్రికెటర్లలో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు గ్రేడ్ బీ కాంట్రాక్ట్ దక్కగా.. తిలక్ వర్మ, నితీష్ రెడ్డి సీ కేటగిరి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.

BCCI Announces Central Contracts 2025 26 as Virat Kohli and Rohit Sharma Moved to Grade B

గ్రేడ్ A ఆటగాళ్లు

శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా


గ్రేడ్ B ఆటగాళ్లు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్

గ్రేడ్ C ఆటగాళ్లు

అక్షర్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్

భారత మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులు:

గ్రేడ్ A: హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ

గ్రేడ్ B: రేణుక ఠాకూర్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, ప్రతికా రావల్, క్రాంతి గాడ్, ఉమా చెరీ, అరుంధతి రెడ్డి

గ్రేడ్ సీ: శ్రీ చరణి, యస్తికా భాటియా, హర్లీన్ డియోల్, కాశ్వీ గౌతమ్, జి కమలిని, వైష్ణవి శర్మ తేజల్ హసబినీస్

Story first published: Monday, February 9, 2026, 20:48 [IST]
Other articles published on Feb 9, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+