Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BCCI Contracts: అయ్యర్, ఇషాన్‌కు చోటు.. ఆ తెలుగోడిపై వేటు!

టీమిండియా ఆటగాళ్ల వేతనాలకు సంబంధించిన వార్షిక( 2024-25) కాంట్రాక్టులను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఈ సారి 34 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టుల్లో చోటు దక్కగా.. ఆ వివరాలను బీసీసీఐ సోమవారం అధికారికంగా వెల్లడించింది. గతేడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్ట్‌లు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి కాంట్రాక్ట్‌ల్లో చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్‌కు గ్రేడ్ బీ కాంట్రాక్ట్ దక్కగా.. ఇషాన్ కిషన్‌కు గ్రేడ్ సీ కాంట్రాక్ట్ లభించింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి గ్రేడ్ సీ కాంట్రాక్ట్ వరించింది. టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్‌ తన గ్రేడ్ ఏ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకున్నాడు.

కేఎస్ భరత్ ఔట్..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ గ్రేడ్ రిటైన్ చేసుకున్నారు. కోహ్లీ, రోహిత్, జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికినా.. వారికి ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వడం గమనార్హం. రెగ్యూలర్‌గా మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అశ్విన్‌.. కాంట్రాక్ట్ పునరుద్దరించలేదు. తెలుగు తేజం కేఎస్ భరత్, జితేశ్ శర్మ కాంట్రాక్ట్‌ల్లో చోటు కోల్పోయారు. నిర్దేశిత సమయంలో మూడు టెస్ట్‌లు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడిన ఆటగాళ్లకు అటోమెటిక్‌గా గ్రేడ్ సీ కాంట్రాక్ట్ దక్కుతుందని గతేడాది బీసీసీఐ ప్రకటించింది.

గ్రేడ్ ఏ ప్లస్ ఆటగాళ్ల రూ. 7 కోట్ల వార్షిక వేతనం అందనుండగా.. గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, గ్రేడ్ బీ ప్లేయర్లకు రూ. 3 కోట్లు, గ్రేడ్ సీ ఆటగాళ్లకు రూ. కోటి రూపాయలు ఇస్తారు. ఈ వార్షిక వేతనం మ్యాచ్ ఫీజులు, అలవెన్స్‌లకు అదనం.

BCCI announces annual contracts for 2024-25 Shreyas Iyer and Ishan Kishan returns

బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లు..

గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.

గ్రేడ్ A: మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, రిషభ్ పంత్.

గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.

గ్రేడ్ C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా.

Story first published: Monday, April 21, 2025, 12:20 [IST]
Other articles published on Apr 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+