For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025 మెగా వేలం: 204 స్థానాల కోసం 574 మంది పోటీ..!

పీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే తుది జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మొత్తం 1574 మంది మెగా వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మంది షార్ట్ లిస్ట్ చేసింది. నవంబర్ 24, 25(ఆది, సోమవారం) తేదీల్లో సౌదీ అరేబియాలో జెడ్డా వేదికగా మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే.

10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం 574 మంది పోటీ పడనున్నారు. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 208 మంది ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉన్నారు. మరో ముగ్గురు అసోసియేట్ నేషన్స్‌కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. భారత్‌కు చెందిన 318 మంది అనామక ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా.. 12 మది అన్‌క్యాప్‌డ్ ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉన్నారు. 70 ఓవర్‌సీస్ స్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

BCCI announced IPL 2025 auction list Pant Shreyas Iyer among players listed in marquee set

రెండు రోజుల పాటు జరిగే మెగా వేలం మధ్యాహ్నం 1 గంటల నుంచి ప్రారంభం కానుంది. అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు జియోసినిమా మెగా వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

రూ.2 కోట్ల కనీస ధరతో 81 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. కోటిన్నర ధరతో 27 మంది, రూ. కోటి 25 లక్షలతో 18 మంది, కోటీ రూపాయలతో 23 మంది, రూ. 75 లక్షలతో 92 మంది, రూ. 50 లక్షలతో 8 మంది, రూ. 40 లక్షలతో 5 మంది, రూ. 30 లక్షలతో 320 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.

ఈ సారి మార్క్యూ ప్లేయర్ల జాబితాలో 12 మందికే అవకాశం ఇచ్చారు. ఈ జాబితాను రెండు సెట్లుగా విభజించారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ మార్క్యూ సెట్-1లోనే ఉన్నారు. వేలంలో తొలి ప్లేయర్‌గా జోస్ బట్లర్ పేరు రానుంది. ఫస్ట్ సెట్‌లోనే రిషభ్ పంత్ పేరు ఉండటంతో అతను ఈజీగా రూ. 30 కోట్లు పలుకుతాడని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

మార్క్యూ ప్లేయర్ల జాబితా..

1) జోస్ బట్లర్ -ఇంగ్లండ్ - 2 కోట్లు - M1

2) శ్రేయస్ అయ్యర్ - భారత్ - 2 కోట్లు - M1

3) రిషభ్ పంత్ - భారత్ - 2 కోట్లు - M1

4) కగిసో రబడా -సౌతాఫ్రికా - 2 కోట్లు - M1

5) అర్ష్‌దీప్ సింగ్ - భారత్ - 2 కోట్లు - M1

6) మిచెల్ స్టార్క్ - ఆస్ట్రేలియా - రూ. 2 కోట్లు - M1

7) యుజ్వేంద్ర చాహల్ - భారత్ - రూ. 2 కోట్లు - M2

8)లియామ్ లివింగ్ స్టోన్ - ఇంగ్లండ్ - రూ. 2 కోట్లు - M2

9) కేఎల్ రాహుల్ - భారత్ - రూ. 2 కోట్లు - M2

10) మహమ్మద్ షమీ - భారత్ - రూ. 2 కోట్లు - M2

11) మహమ్మద్ సిరాజ్ - భారత్ - రూ. 2 కోట్లు - M2

12) డేవిడ్ మిల్లర్ - South Africa - రూ. 1.5 కోట్లు - M2

Story first published: Friday, November 15, 2024, 20:04 [IST]
Other articles published on Nov 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+