సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఆడే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శనివారం వెల్లడించింది.
గాయంతో గతేడాదిగా భారత జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ.. ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. తెలుగు తేజాలు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మలు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు షమీతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ ఎంపికవ్వగా.. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు.
జనవరి 22 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా జనవరి 22న జరగనుండగా.. రెండో టీ20 చెన్నై వేదికగా జనవరి 25, మూడో టీ20 రాజ్‌కోట్ వేదికగా జనవరి 28న, నాలుగో టీ20 పుణే వేదికగా జనవరి 31న, ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబై వేదికగా జరగనుంది. టీ20 మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.
టీ20 సిరీస్ బరిలోకి దిగే భారత్ జట్టు:
సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్.
#TeamIndia's squad for the T20I series against England 🔽
— BCCI (@BCCI) January 11, 2025
Suryakumar Yadav (C), Sanju Samson (wk), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Rinku Singh, Nitish Kumar Reddy, Axar Patel (vc), Harshit Rana, Arshdeep Singh, Mohammad Shami, Varun Chakravarthy, Ravi Bishnoi,… https://t.co/eY8LUSspCZ