సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్.. పాండ్యా, ధావన్ ఆగయా.. రోహిత్‌కు నో చాన్స్.. !!

ముంబై: న్యూజిలాండ్ గడ్డపై ఘోరంగా విఫలమైన భారత పురుషుల జట్టు.. స్వదేశంలో మరో రసవత్తరపోరుకు సిద్ధమైంది. మార్చి 12 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. సునీల్ జోషీ నేతృత్వంలోని నూతన సెలెక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. వర్క్‌లోడ్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరిగినా.. బోర్డు మాత్రం అతన్నే కొనసాగించింది.


సూపర్ ఫామ్ పాండ్యా రీ ఎంట్రీ..
ఇక గాయాలతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఓపెనర్ శిఖర్ ధావన్, బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్‌పై శిక్షణను తీసుకున్న విషయం తెలిసిందే. ఇక పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్ధిక్ పాండ్యా.. దేశవాళీ టోర్నీ డివై పాటిల్ టీ20 కప్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. భువనేశ్వర్, ధావన్ కూడా ఆడినా.. అంతగా రాణించలేకపోయారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భుజగాయానికి గురైన ధావన్.. న్యూజిలాండ్ టూర్‌కు దూరమైన విషయం తెలిసిందే.
రోహిత్‌కు విశ్రాంతి
ఇక న్యూజిలాండ్ పర్యటన నుంచి పిక్క గాయంతో అర్థాంతరంగా తప్పుకున్న పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అవకాశం దక్కలేదు. గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతనికి మరికొద్ది రోజులు విశ్రాంతి అవసరమని బీసీసీఐ భావిస్తోంది. బ్యాకప్ ఓపెనర్లుగా పృథ్వీషా, శుభ్‌మన్ గిల్‌లు అవకాశం దక్కించుకున్నారు. న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన మయాంక్ అగర్వాల్‌పై వేటుపడింది.

సంజూశాంసన్‌కు నిరాశే..
ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కీపర్ సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. రిషభ్ పంత్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. అనూహ్యంగా కీపర్ అవతారమెత్తిన కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తుండటంతో సెలెక్టర్లు శాంసన్ పేరు పరిశీలించలేదు. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌లు తమ స్థానాలను నిలబెట్టుకోగా.. బౌలర్లలో భువనేశ్వర్ రాకతో.. షమీకి విశ్రాంతినిచ్చారు. ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి విమర్శలు ఎదుర్కొంటున్న జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్, సైనీలతో పేస్ దళాన్ని నడిపించనున్నాడు. ఇక శార్ధుల్ ఠాకుర్‌కు అవకాశం దక్కలేదు. ఆల్‌రౌండర్ జడేజా, కుల్చా జోడీ జట్టులో చోటుదక్కించుకున్నారు.

భారత జట్టు:
శిఖర్ ధావన్, పృథ్వీషా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, అయ్యర్, రిషభ్ పంత్, హర్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, జస్ ప్రీత్ బుమ్రా, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications