
న్యూఢిల్లీ: ఈ ఏడాదంతా టీమిండియా తీరిక లేని షెడ్యూల్‌తో గడపనుంది. ఇప్పటికే గ్యాప్ లేకుండా ఆడుతున్న భారత జట్టు.. టీ20 ప్రపంచకప్ ముందు ఉన్న ఖాలీ సమయంలోనూ బిజిబిజీగా గడపనుంది. టీమిండియా జింబాబ్వే పర్యటన అనంతరం భారత్ జట్టు సొంతగడ్డపై మూడు సిరీస్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మూడు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా భారత్‌కు రానుండగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా సుదీర్ఘ కాలం పర్యటించనుంది.
మూడు టీ20లతో పాటు మూడు వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఈ మూడు సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 20న ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ మొదలు కానుండగా... సెప్టెర్ 28 నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వా త భారత్ ప్రపంచకప్ బరిలోకి దిగనుంది.
భారత పర్యటనలో ఆస్ట్రేలియా షెడ్యూల్
సెప్టెంబర్ 20- తొలి టీ20 (మొహాలీ)
సెప్టెంబర్ 23- రెండో టీ20 (గౌహతి)
సెప్టెంబర్ 23- మూడో టీ20 (హైదరాబాద్)
భారత పర్యటనలో దక్షిణాఫ్రికా షెడ్యూల్..
సెప్టెంబర్ 28- తొలి టీ20 (తిరువనంతపురం)
అక్టోబర్ 2- రెండో టీ20 (గౌహతి)
అక్టోబర్ 4- మూడో టీ20 (ఇండోర్)
అక్టోబర్ 6- తొలి వన్డే (లక్నో)
అక్టోబర్ 9- రెండో వన్డే (రాంచీ)