For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka రివైజ్డ్ షెడ్యూల్.. విరాట్ కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ!

BCCI Announce Revised Schedule Sri Lanka Tour Of India

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) షాకిచ్చింది. కెరీర్‌లో అతను ఆడనున్న 100వ టెస్ట్‌ను బెంగళూరు వేదికగా కాకుండా ముందుగా ప్రకటించిన వేదికలోనే నిర్వహించనుంది. కోహ్లీ 100వ టెస్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఇటీవలే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ మైలు రాయి టెస్ట్‌ను అతనికి ప్రత్యేక అనుబంధం ఉన్న బెంగళూరు వేదికగా నిర్వహిస్తామని, అందులోనే డే అండ్ నైట్ టెస్ట్ జరుపుతామని తెలిపాడు.

రివైజ్డ్ షెడ్యూల్..

రివైజ్డ్ షెడ్యూల్..

అయితే భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న టీ20, టెస్ట్‌ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా సవరించింది. మార్చిన షెడ్యూల్‌ను మంగళవారం అధికారికంగా ప్రకటించింది. భారత్‌కు రానున్న శ్రీలంక ముందుగా ప్రకటించిన విధంగా తొలుత టెస్ట్‌ సిరీస్‌ కాకుండా టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఫిబ్రవరి 24న లక్నోలో, రెండు, మూడో టీ20లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం తొలి టెస్ట్‌ మార్చి 4 నుంచి మొహాలీ వేదికగా, రెండో టెస్ట్‌ మార్చి 12 నుంచి బెంగళూరులో జరగనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. బెంగళూరు వేదికగా జరిగబోయే టెస్ట్‌ మ్యాచ్‌ను డే అండ్‌ నైట్ టెస్ట్‌(పింక్‌ బాల్‌)గా నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ అధికారికంగా ఖరారు చేసింది.

కోహ్లీకి షాక్..

కోహ్లీకి షాక్..

దాంతో బీసీసీఐ తాజాగా వేదికల మార్పు అంశాన్ని పక్కన పెట్టి.. కోహ్లీ కెరీర్‌లో అరుదైన మైలురాయిగా నిలిచే 100వ టెస్ట్‌ మ్యాచ్‌ను బెంగళూరు నగరంలో కాకుండా ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే మొహాలిలో నిర్వహించేందుకు సిద్దమైంది . ఇది విరాట్‌ కోహ్లితో పాటు ఆర్‌సీబీ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. షెడ్యూల్‌ మార్పు విషయంలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు అభ్యర్ధనను మన్నించి, ముందుగా టీ20 సిరీస్‌కు అనుమితిచ్చిన బీసీసీఐ, కోహ్లీకి చిరకాలం గుర్తుండిపోయే టెస్ట్‌ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా కొనసాగించడాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Sachin Tendulkar's 5 Best ODI's | Oneindia Telugu
ఐపీఎల్‌తో బెంగళూరు..

ఐపీఎల్‌తో బెంగళూరు..

కాగా, కెరీర్‌లో ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన కోహ్లీకి ఐపీఎల్‌ కారణంగా బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌తో కలుపుకుని మొత్తం 15 సీజన్ల పాటు అతనురాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)కే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో మరే ఇతర ఆటగాడు కోహ్లీలా ఒకే జట్టుకు ఇన్నేళ్లు ఆడింది లేదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రోహిత్‌ సారధ్యంలోని టీమిండియా.. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడుతుంది. ఇందులో భాగంగా జరిగిన వన్డే సిరీస్‌ను రోహిత్‌ సేన..3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ బుధవారం (ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, February 15, 2022, 22:08 [IST]
Other articles published on Feb 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+