For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka పూర్తి షెడ్యూల్ ఇదే: బీసీసీఐ

ఐదు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా... ఈ నెలాఖరులో శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. శ్రీలంక గడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఖరారు చేసింది. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది.

ఈ నెల 26 నుంచి మూడు టీ20ల సిరీస్, ఆగస్ట్ 1 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2.30కు మొదలవ్వనున్నాయి. ఈ పర్యటనతో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. తన బాధ్యతలను చేపట్టనున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లు ఈ పర్యటనతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

BCCI announce India vs Sri Lanka Complete Schedule

అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడటంపై క్లారిటీ లేదు. ఈ ఇద్దరికి ఈ పర్యటన నుంచి కూడా విశ్రాంతి కల్పిస్తే హార్దిక్ పాండ్యా జట్టును నడిపించే అవకాశం ఉంది.

శ్రీలంకతో టీ20 సిరీస్
తొలి టీ20: జూలై 26, పల్లెకెలె

రెండో టీ20: జూలై 27, పల్లెకెలె

మూడో టీ20: జూలై 29, పల్లెకెలె

శ్రీలంకతో వన్డే సిరీస్

తొలి వన్డే: ఆగస్ట్ 1, కొలంబో

రెండో వన్డే: ఆగస్ట్ 4, కొలంబో

మూడో వన్డే: ఆగస్ట్ 1, కొలంబో

Story first published: Thursday, July 11, 2024, 19:28 [IST]
Other articles published on Jul 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+