Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Tour of South Africa షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. ఎప్పుడంటే?

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివర్లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నెల రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ పర్యటనలో టీమిండియా.. ఆతిథ్య సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) విడుదల చేసింది.

వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం నెల రోజుల విరామం తర్వాత టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు మూడు టీ20ల సిరీస్, డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడు వన్డేల సిరీస్, డిసెంబర్ 26 నుంచి జనవరి 7 వరకు రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది.

BCCI announce fixtures for India’s Tour of South Africa 2023-24

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో టీమిండియా ముందంజ వేయాలంటే ఈ పర్యటనలోని సిరీస్ గెలవడం చాలా కీలకం. విదేశాల్లో గెలిచే సిరీస్ ఫలితం ఆధారంగానే టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రధాన జట్టునే ఈ పర్యటనకు పంపించనున్నారు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వన్డే ప్రపంచకప్ ఫలితం ఆధారంగా మార్పులు చేయనున్నారు.

సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20ల్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ ఆటగాళ్లను మాత్రమే కొనసాగిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ తర్వాత సీనియర్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. టీమిండియా విజేతగా నిలిస్తే మాత్రం సీనియర్లు కొనసాగనున్నారు.

పేలవ ప్రదర్శన మరోసారి నిరాశపరిస్తే మాత్రం భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.

టీమిండియా సౌతాఫ్రికా పర్యటన 2023-24:

టీ20 సిరీస్
తొలి టీ20: డిసెంబర్ 10(ఆదివారం), డర్బన్

రెండో టీ20: డిసెంబర్ 12(మంగళవారం), పోర్ట్ ఎలిజబెత్

మూడో టీ20: డిసెంబర్ 14(గురువారం), జోహన్నెస్‌బర్గ్

వన్డే సిరీస్..
తొలి వన్డే: డిసెంబర్ 17(ఆదివారం), జోహన్నెస్‌బర్గ్

రెండో వన్డే: డిసెంబర్ 19(మంగళవారం), పోర్ట్ ఎలిజబెత్

మూడో వన్డే: డిసెంబర్ 21(గురువారం), పార్ల్

టెస్ట్ సిరీస్
తొలి టెస్ట్: డిసెంబర్ 26( మంగళవారం) నుంచి 30, సెంచూరియన్

రెండో టెస్ట్: జనవరి(బుధవారం) 3 నుంచి 7, కేప్‌టౌన్.

Story first published: Friday, July 14, 2023, 20:53 [IST]
Other articles published on Jul 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+