ఈ ఏడాది భారత ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. అందరూ ఊహించనట్లుగానే దేశవాళీ క్రికెట్ ఆడకుండా బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన స్టార్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో నిలకడగా రాణించిన యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్.. తొలి సారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను అందుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏ ప్లస్ కాంట్రాక్ట్‌ను నిలుపుకున్నారు.

ఆ ఇద్దరికి నో ఛాన్స్..:
గతేడాది బీ కేటగిరిలో కొనసాగిన శ్రేయస్ అయ్యర్, సీ కేటగిరిలో ఉన్న ఇషన్ కిషన్‌కు ఈ సారి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కలేదు. వెటరన్ టెస్ట్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలకు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌లు దక్కలేదు. వన్డే ప్రపంచకప్‌లో గాయపడి జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకున్నాడు.
కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్‌కు బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు ప్రమోషన్ దక్కింది. ఘోర రోడ్డు ప్రమాదంతో గతేడాదిగా జట్టుకు దూరమైన రిషభ్ పంత్‌కు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. శివమ్ దూబే, రవి బిష్ణోయ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్, ముఖేష్ కుమార్, జితేష్ శర్మలకు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది. రాంచీ టెస్ట్ విన్నర్ ధ్రువ్ జురెల్‌కు మాత్రం నిరాశే ఎదురైంది.
వార్షిక వేతనం..:
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ల ప్రకారం ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్ల వార్షిక వేతనం దక్కనుండగా.. ఏ గ్రేడ్ ప్లేయర్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 3 కోట్లు. సీ గ్రేడ్ ఆటగాళ్లకు కోటి రూపాయలు వార్షిక వేతనంగా దక్కనుంది. మ్యాచ్ ఫీజులతో సంబంధం లేకుండా ఆటగాళ్లకు ఈ వేతనం ఇస్తారు.
2023-24 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్లు:
ఏ ప్లస్ గ్రేడ్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
ఏ గ్రేడ్: అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా
బీ గ్రేడ్: సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్
సీ గ్రేడ్: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, రజత్ పాటిదార్.