Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫామ్ తెచ్చిన తంటాలు.. జింబాబ్వే పర్యటనకు విరాట్ కోహ్లీ! ద్వితీయ శ్రేణి జట్టుతో..

BCCI and selectors want Virat Kohli to play India vs Zimbabwe series to regain form’

హైదరాబాద్: 'ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి'అనే సామెత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడు తనదైన ఆటతో పరుగుల రారాజుగా అందరి మన్ననలు అందుకున్న విరాట్ కోహ్లీ ఇప్పడు పేలవ ఫామ్‌తో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. మేటీ క్రికెటర్‌గా భారత క్రికెట్‌ను ఏలిన కోహ్లీ ఇప్పుడు జట్టులో చోటు కోసం ఆపసోపాలు పడుతున్నాడు.

గత మూడేళ్లుగా సెంచరీలేక పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న కోహ్లీ ఇప్పటీకే టీమిండియా సారథ్య బాధ్యతలను కోల్పోయాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలోనూ చెత్త ప్రదర్శనతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నాడు.

లండన్‌లోనే మకాం..

లండన్‌లోనే మకాం..

ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్న కోహ్లీ క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి కుటుంబంతో గడపాలనుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అనుమతితో లీవ్ తీసుకున్న అతను నెల రోజుల పాటు సతీమణి అనుష్క శర్మ, కూతురు వామికాతో పాటు లండన్‌లో ఉండనున్నాడు. అతను నివసించే ప్రదేశాన్ని సీక్రెట్‌గా ఉంచిన కోహ్లీ.. అక్కడికే తన తల్లి, చెల్లి ఇతర సన్నిహితులను పిలుపుంచుకున్నాడు. ఈ నెల రోజులను కుటుంబంతో పూర్తిగా ఆస్వాదించి ఆసియాకప్‌లో సత్తా చాటాలని కోహ్లీ అనుకున్నాడు. దాంతో అంతా కోహ్లీ నెల రోజుల పాటు ఆటంగా దూరంగా ఉంటాడని భావించారు.

 ద్వితీయ శ్రేణి జట్టుతో..

ద్వితీయ శ్రేణి జట్టుతో..

అయితే బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం కీలక ఆసియాకప్ ముందే విరాట్ ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నారు. దీనికోసం ప్రణాళికలు కూడా రచిస్తున్నారు. వెస్టిండీస్ పర్యటన అనంతరం భారత జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే టూర్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ సిరీస్‌కు సీనియర్లకు రెస్ట్ ఇచ్చి ద్వితీయ శ్రేణి జట్టును పంపించనున్నారు. శిఖర్ ధావన్‌ ఈ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీని కూడా ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ సిరీస్ ఆడటం ద్వారా కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని, అది ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ ముందు జట్టుకు మేలు చేస్తోందని ఓ సెలెక్టర్ ఇన్‌సైడ్ స్పోర్ట్ వెబ్‌సైట్‌కు తెలిపాడు.

 జింబాబ్వే పర్యటన కరెక్ట్..

జింబాబ్వే పర్యటన కరెక్ట్..

'ప్రస్తుతం విరాట్ కోహ్లీ తీసుకున్న బ్రేక్‌‌తో అతనికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నా. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ఈ బ్రేక్ ఉపయోగపడుతుందనుకుంటున్నా. అయితే ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడకుండా పెద్ద టోర్నీలు ఆడటం కష్టం అవుతుంది. అందుకే మేం అతన్ని జింబాబ్వే పర్యటనకు పంపించాలనుకుంటున్నాం.

అది అతనికి అనుగైన ఫార్మాట్. ఆసియా కప్ ముందు మళ్లీ ఫామ్ అందుకనేందుకు కోహ్లీకి జింబాబ్వే పర్యటన ఉపయోగపడుతుంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం.'అని సదరు సెలెక్షన్ కమిటీ మెంబర్ తెలిపాడు.

పాపం కోహ్లీ..

పాపం కోహ్లీ..

ఇక ఈ వార్తలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కోహ్లీకి ఎంత గడ్డుకాలం వచ్చే అంటూ సెటైరిక్‌గా కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు తనదైన ఆటతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన కోహ్లీ ఇప్పుడు చిన్న దేశాలతో ఆడుకునే పరిస్థితి వచ్చిందంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇక ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో రాణించకపోతే టీమిండియా టీ20 జట్టు నుంచి తప్పిస్తామని కోహ్లీకి సెలెక్టర్లు తెలియజేశారని సమాచారం. ప్రస్తుతం కోహ్లీ ఏది కలిసిరావడం లేదు. మరీ జింబాబ్వే పర్యటనలో ఏం చేస్తాడో చూడాలి.

Story first published: Wednesday, July 20, 2022, 14:59 [IST]
Other articles published on Jul 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+