For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేన X బీసీసీఐ.. పృథ్వీ షా కోసం గొడవ!

BCCI and selectors not ready to send Prithvi Shaw and Padikkal to England
IND vs ENG 2021 : Selectors Decline Management's Request To Send Prithvi Shaw, Devdutt Padikkal

న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ను ఇంగ్లండ్ పర్యటనకు పంపే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎటూ తేల్చుకోలేకపోతున్నది. ఈ విషయంపై టీమిండియా మేనేజ్‌మెంట్, బీసీసీఐ మధ్య భేదాభిప్రాయాలు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం యూకే పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టులో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడిన అతను.. అనూహ్యంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ముందు గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.

పట్టించుకోని సెలెక్షన్ కమిటీ..

పట్టించుకోని సెలెక్షన్ కమిటీ..

అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ను అక్కడికి పంపాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మకు మెయిల్ రాసింది. కానీ ఈ మెయిల్‌కు చేతన్ శర్మ ఎలాంటి బదులివ్వలేదు. ఇప్పటికే టీమ్‌లో అదనపు ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఈశ్వరన్ అభిమన్యు (స్టాండ్‌ బై) అందుబాటులో ఉండగా.. పృథ్వీ షా, పడిక్కల్‌ను పంపే ఆలోచనలో సెలెక్షన్ కమిటీ లేదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. షా, పడిక్కల్.. లంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతాయని స్పష్టం చేశాయి.

శ్రీలంక పర్యటనలోనే షా, పడిక్కల్..

శ్రీలంక పర్యటనలోనే షా, పడిక్కల్..

'పృథ్వీ షా, పడిక్కల్ లంక్ పర్యటలోనే కొనసాగుతారు. గిల్ రిప్లేస్‌మెంట్‌గా ఎవర్నీ పంపడం లేదు. ఈ విషయంలో సెలెక్షన్ కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేదు. లంక టూర్ ముగిసిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. అప్పటి వరకు ఇప్పుడున్న పరిస్థితే కొనసాగుతుంది'అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. శ్రీలంకతో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు కొలంబో వేదికగా ఈ నెల 13 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని ఆడనుంది. ఈ జట్టులోకి ఓపెనర్లుగా పృథ్వీ షా, దేవదత్ పడికల్, రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యారు. ఈ సిరీస్ జులై 25న ముగియనుండగా.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ జరగనుంది.

ఎందుకు పట్టుబడుతోంది..

ఎందుకు పట్టుబడుతోంది..

ఈ నేపథ్యంలో.. పృథ్వీ షాతో పాటు అదనంగా దేవదత్ పడిక్కల్‌‌ని కూడా ఇంగ్లండ్‌కు పంపాలని టీమిండియా మేనేజ్‌మెంట్ డిమాండ్ చేస్తోంది. కానీ.. జట్టులో ఉన్న ముగ్గురు ఓపెనర్లని కాదని.. పృథ్వీ షా, పడిక్కల్‌ని ఇంగ్లండ్‌కి పంపితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీసీసీఐ భావిస్తోంది. దాంతో.. పృథ్వీ షాని పంపేది లేదని.. టీమ్‌లో ఉన్న వాళ్లతో సర్దుకోవాలని ఇప్పటికే సమాధానం ఇచ్చింది. కానీ.. ఈ గొడవ ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు. 'ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన 24 మంది పూల్‌లో పృథ్వీ షా లేడు. మరి ఇప్పుడు ఎక్కడ తేడా కొట్టింది..? ఎందుకు అతని కోసం డిమాండ్ చేస్తున్నారు..? ఇక దేవదత్ పడిక్కల్ అంటారా.. నిజమే అతను బాగా టాలెంటెడ్. కానీ.. ఈ తరహాలో అతడ్ని జట్టులోకి తోయకూడదు. అతని టైమ్ వస్తుంది'అని మరో బీసీసీఐ అధికారి తెలిపారు.

Story first published: Thursday, July 8, 2021, 21:52 [IST]
Other articles published on Jul 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+