Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కప్పు తెచ్చిన కుర్రాళ్ల కోసం ‘19 ప్లస్’ టీమ్!

BCCI and NCA may introduce 19 plus team to stop talented boys from going off radar
U19 World Cup: Future Of Indian Cricket టీమిండియాలోకి వస్తారా ? | Sheikh Rashid | Oneindia Telugu

న్యూఢిల్లీ: అండర్ 19 ప్రపంచకప్ ఆడి, కప్పు సాధించిన యువ భారత్ నుంచి చాలా మంది ప్లేయర్లు తర్వాత సీనియర్ టీమ్‌లోకి వచ్చి స్టార్లుగా ఎదిగారు. మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లంతా ఈ జాబితాలోకే వస్తారు. అయితే ఉన్ముక్త్ చంద్, కమల్ పస్సీ, రవికాంత్ సింగ్, మంజోత్ కల్రా వంటి టాలెంటెడ్ ప్లేయర్లు మాత్రం కెరీర్‌లో ముందుకెళ్లలేకపోయారు. సరైన కోచింగ్, గైడెన్స్ లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణం. ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా ఉండేందుకు బీసీసీఐ, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) ఓ ప్రణాళికను సిద్దం చేయాలనుకుంటుంది.

కొత్తగా 19 ప్లస్ టీమ్...

కొత్తగా 19 ప్లస్ టీమ్...

తద్వారా అండర్ 19 ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత ఈ యంగ్ స్టర్స్ డెవలప్‌మెంట్‌ను మానిటర్ చేసి వాళ్లు సీనియర్ టీమ్‌లోకి వచ్చేలా గైడెన్స్ ఇవ్వనుంది. ఇందుకోసం కొత్తగా అండర్‌-19+ వయో విభాగం జట్టును ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తోంది. తాజా అండర్‌-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన షేక్‌ రషీద్‌ (ఆంధ్ర), రవి కుమార్‌ (బెంగాల్‌), రాజ్‌ అంగద్‌ బవా (చండీగఢ్‌), యశ్‌ ధుల్‌ (దిల్లీ)కు నేరుగా రంజీ జట్టులో చోటు దక్కొచ్చు. కానీ ప్రస్తుత జట్టులోని చాలా మంది అండర్‌-19 తదుపరి దశ, రంజీ ట్రోఫీకి మధ్య ఎటూ గాని స్థితిలో ఉండే అవకాశముంది. రాష్ట్ర స్థాయిలో అండర్‌-25 విభాగం ఉంది. కానీ జట్లలోని కొన్ని స్థానాల కోసం విపరీతమైన పోటీ ఉంది.

అయిదు అంచెల వ్యవస్థ..

అయిదు అంచెల వ్యవస్థ..

‘సీనియర్‌ భారత జట్టు కోసం ఆటగాళ్లను సిద్ధం చేయడం కోసం ఎన్‌సీఏ భవిష్యత్తులో అయిదు అంచెల వ్యవస్థపై దృష్టి పెట్టే అవకాశముంది. ఈ వ్యవస్థలో మొదట అండర్‌-16, ఆ తర్వాత అండర్‌-19, ఎమర్జింగ్‌ (జాతీయ అండర్‌-23), ఎ జట్టు ఉంటాయి. ఈ వ్యవస్థలో ఇప్పుడు 19+ విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఈ విభాగంలో ఈ కుర్రాళ్లందరినీ కలపొచ్చు'' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఈ విభాగాలన్నింటిలో బీసీసీఐ అండర్‌-25 (రాష్ట్ర 'ఎ'జట్టు) సీనియర్‌ స్థాయికి వెళ్లలేని ఆటగాళ్లకు వేదికలా ఉపయోగపడుతోంది.

అకాడమీలోనే ..

అకాడమీలోనే ..

ఇప్పటికీ ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌ క్రమం తప్పకుండా ఆడని 23-24 ఏళ్ల ఆటగాళ్లలో చాలా మంది సీనియర్‌ గ్రేడ్‌కు వెళ్లలేకపోవచ్చని కోచ్‌లకు తెలుసు. ఈ నేపథ్యంలో అండర్‌-19, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు మధ్య వారధి అవసరం. నాలుగు ఫస్ట్‌క్లాస్‌ స్థాయి మైదానాలతో కొత్త ఏన్‌సీఏ వాడుకలోకి వచ్చిందంటే.. అకాడమీ తన సొంత అండర్‌-19+ జట్లను కలిగి ఉండొచ్చు. తమలో తామే ఆడుతూ ఉండే ఈ జట్ల పురోగతిని కోచ్‌లు, ట్రెయినర్లు, ఫిజియోలు పర్యవేక్షించవచ్చు. వాళ్లు పై గ్రేడ్‌కు వెళ్లి రాష్ట్ర 'ఎ' జట్టు (అండర్‌-25) ఆడితే లేదా రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించవచ్చు. ఏ జట్టుకూ ఎంపిక కాకపోతే కనీసం ఎన్‌సీఏ పరిధిలోనైనా ఉంటారు.

త్వరలోనే ఓ బ్లూ ప్రింట్..

త్వరలోనే ఓ బ్లూ ప్రింట్..

ఈ విషయంలో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్‌సీఏ చీఫ్ వీ లక్ష్మణ్‌తో కలిసి నేషనల్ జూనియర్, సీనియర్ టీమ్ సెలెక్టర్లతో సమావేశమై ఓ బ్లూ ప్రింట్‌ను తయారు చేయాలని ఆదేశించే అవకాశం ఉంది.‘అండర్‌-19 ప్రపంచకప్పుతో మనమంతా పొంగిపోతున్నాం. మనకు గొప్ప వ్యవస్థ ఉంది. అందు వల్లే మన జూనియర్‌ జట్లు ప్రపంచ స్థాయిలో ఎప్పుడూ ఉన్నత స్థితిలో ఉంటున్నాయి. కానీ ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ వచ్చేసరికే తేడా వస్తోంది. 2012 అండర్‌-19 జట్టునే తీసుకోండి. హనుమ విహారి ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతా వాళ్లెక్కడున్నారో తెలియదు. అందులో చాలా మంది కనీసం తమ తమ రాష్ట్రాల్లో అత్యుత్తమ దేశవాళీ ఆటగాళ్లుగా కూడా లేరు'అని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి అన్నాడు.

Story first published: Tuesday, February 8, 2022, 8:48 [IST]
Other articles published on Feb 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+