దయచేసి టీమిండియాను పంపండి.. మా దేశం సురక్షితంగా ఉంది: బంగ్లాదేశ్
భారత జట్టును బంగ్లాదేశ్ పర్యటనకు పంపాలని బీసీసీఐని ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తమ దేశం సురక్షితంగా ఉందని, టీమిండియా తప్పకుండా తమ దేశానికి వస్తుందనే నమ్మకం ఉందని బీసీబీ అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం గతేడాది ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం భారత్.. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సింది. కానీ, ఆ సమయంలో బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటనను ఈ ఏడాది సెప్టెంబర్‌కు వాయిదా వేసారు. అయితే బంగ్లాదేశ్‌లో భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఈ పర్యటనపై బీసీసీఐ పునరాలోచనలో పడింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ తమీమ్ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'భారత్‌తో సిరీస్ గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ తప్పకుండా టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటికే బీసీసీఐతో సంప్రదింపులు ప్రారంభించాం. ఈమెయిల్స్ రూపంలోనూ చర్చలు జరుగుతున్నాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.
భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ అత్యంత సురక్షితమైన దేశం. ఇక్కడ వారికి ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు రావు. మా వైపు నుంచి అవసరమైన అన్ని భద్రతా చర్యలను తీసుకుంటున్నాం. బీసీబీ ప్రెసిడెంట్‌గా నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని నేను అధిగమించలేను.
నా బాధ్యత పరిధిలో సాధ్యమైనంత వరకూ సంబంధిత వ్యక్తులతో మాట్లాడుతూనే ఉన్నా. బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడితే ప్రయోజనం ఏంటనేది వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నా.'అని తమీమ్ పేర్కొన్నారు. భారత క్రికెట్ క్యాలెండర్‌లో సెప్టెంబర్ విండో ఖాళీగా లేదు. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఇప్పుడు బంగ్లా పర్యటనను ఖరారు చేస్తే అఫ్గాన్‌తో సిరీస్‌ను వాయిదా వేయాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

