బీసీసీఐతో కాళ్ల బేరానికి బంగ్లాదేశ్.. ఆ ఓవరాక్షన్ ఛైర్మన్‌పై వేటు!
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో సంబంధాలను మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. భారత్‌కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) చీఫ్ అమీనుల్ బల్పుల్‌పై వేటు వేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ ఆడేందుకు భారత్‌కు వెళ్లమని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని అప్పట్లో అమీనుల్ బల్బుల్ డిమాండ్ చేశాడు.
పాకిస్థాన్ మాటలు పట్టుకొని టోర్నీ నుంచి తప్పుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన బంగ్లాదేశ్ నయా ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంది. బోర్డు కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసి బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో 11 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీసీబీలో తదుపరి ఎన్నికలు జరిగే వరకు ఈ కమిటీ బాధ్యతలు నిర్వహిస్తుందని పేర్కొంది.

కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో..
తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలోని ఈ బోర్డులో రష్నా ఇమామ్, మీర్జా యాసిర్ అబ్బార్, సయ్యద్ ఇబ్రహీం అహ్మద్, ఇస్రాఫిల్ ఖోస్రూ, మిన్హాజుల్ అబెడిన్ నాన్నూ, అథర్ అలీ ఖాన్‌లు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో జాతీయ ఎన్నికల జరగ్గా.. కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. అంతకుముందు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది. భారత్‌పై అక్కసుతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీని బహిష్కరించింది.
ఐపీఎల్ 2026 సీజన్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని కేకేఆర్ టీమ్‌ను బీసీసీఐ ఆదేశించడంతో వివాదం మొదలైంది. ఈ నిర్ణయంపై ఆగ్రహించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌లో పర్యటించకూడదని నిర్ణయించుకుంది. అయితే కొత్త క్రీడా మంత్రి అమీనుల్ హక్ ఐసీసీతో సంప్రదింపులు జరిపి బోర్డు నాయకత్వంలో మార్పులు ఉంటాయని సూచించారు.
భారత్‌తో సంబంధాలను..
భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బంగ్లాదేశ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల ప్రసారంపై ఉన్న నిషేధాన్ని తొలగించింది. గతంలో టీ20 ప్రపంచకప్ విషయంలో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన తమీమ్ ఇక్బాల్‌కు బోర్డు బాధ్యతలు అప్పగించింది.
గతంలో తమీమ్ ఇక్బాల్ భారత్‌కు అనుకూలంగా మాట్లాడారని బీసీబీ డైరెక్టర్ ఎం. నజ్ముల్ ఇస్లాం ఆయన్ని "ఇండియన్ ఏజెంట్" అని విమర్శించడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తర్వాత నజ్ముల్‌ను పదవి నుంచి తొలగించారు.
బంగ్లాదేశ్ పర్యటనకు భారత్..?
రాబోయే కాలంలో మూడు వన్డేలు, టీ20 సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతేడాది రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత జట్టు పర్యటన వాయిదా పడింది. అలాగే బంగ్లాదేశ్ మహిళల జట్టు భారత పర్యటన కూడా రద్దయింది. ఇరు దేశాల మధ్య సత్పంబంధాలు మెరుగవుతుండటంతో తిరిగి క్రికెట్ సంబంధాలు కూడా మొదలవ్వనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications