Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4 బంతుల్లో 4 వికెట్లు.. ప్యాడ్స్ లేకుండా బ్యాటింగ్‌కు దిగిన పాక్ క్రికెటర్! (వీడియో)

ఆస్ట్రేలియా బౌలర్ డాలియల్ సామ్స్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. బిగ్‌బాష్ లీగ్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు వికెట్లు తీసిన డానియల్ సామ్స్.. మరో వికెట్‌‌ను రనౌట్ ద్వారా సాధించాడు.

మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిడ్నీ థండర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డానియల్ సామ్స్ చివరి ఓవర్‌లో ఈ ఫీట్ సాధించింది. మెల్ బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ను బౌలింగ్ చేసిన డానియల్ సామ్స్.. మూడో బంతికి బ్యూ వెబ్‌స్టర్(59)ను రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

BBL 2023: Haris Rauf Comes Out To Bat Without Pads As Melbourne Stars Lose 4 Wickets In 4 Balls

మరుసటి బంతికి ఉసామా మిర్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. ఐదో బంతికి మార్క్ స్టేకెటీ(0)ని రనౌట్ చేసిన సామ్స్.. ఆఖరి బంతికి లియామ్ డాసన్(2)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. అయితే మూడో వికెట్ రనౌటవ్వడంతో అతనికి హ్యాట్రిక్ మిస్సైంది. డానియల్ సామ్స్ కారణంగా హ్యారీస్ రౌఫ్ ప్యాడ్స్ లేకుండానే మైదానంలోకి వచ్చాడు.

టైమ్డ్ ఔట్ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ఆలస్యం చేయకుండా బ్యాట్ పట్టుకొని ప్యాడ్స్ లేకుండానే బరిలోకి దిగాడు. అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఘనత శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగా పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. డానియల్ సామ్స్(4/33) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సిడ్నీ థండర్ 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్‌లో అదరగొట్టిన డానియల్ సామ్స్.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. 22 పరుగలతో అజేయంగా నిలిచి జట్టుకు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్ 2022 సీజన్ వరకు ఆర్‌సీబీకి ఆడిన డానియల్ సామ్స్.. గత సీజన్‌తో పాటు ఈ సీజన్‌లో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.

Story first published: Saturday, December 23, 2023, 14:02 [IST]
Other articles published on Dec 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+