Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి లక్ రా అయ్యా.. బౌల్డ్ అయినా కింద పడని బెయిల్స్ (వీడియో)

ఆస్ట్రేలియా ఫ్రాంచైజీ టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్‌లో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ బౌల్డ్ అయినా కూడా నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆ బంతి నో బాల్ అని అనుకుంటే పొరపాటే. బెయిల్స్ కిందపడకపోవడంతో ఔటవ్వకుండా సదరు బ్యాటర్ బచాయించాడు. బ్యాటర్ లక్ బాగుండటం.. బౌలర్‌ నెత్తిపై దురదృష్టం తాండవం చేయడంతో ఈ విచిత్రకర ఘటన చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. శనివారం బ్రిస్బేన్ హీట్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను గ్జేవియర్ బార్ట్‌లెట్ వేసాడు. ఈ ఓ చివరి బంతికి నిక్ హబ్సన్ బౌల్డ్ అయ్యాడు.

BBL 2023: Bizarre incident as bails remain intact despite the ball smashing onto the stumps

గ్జేవియర్ బార్ట్‌లెట్ వేసిన స్లోయర్ బాల్‌ను హబ్సన్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్‌ను మిస్సైన బంతి అతని ప్యాడ్లను ముద్దాడుతూ వికెట్లను తాకింది. కానీ బెయిల్స్ కిందపడలేదు. దాంతో నిక్ హబ్సన్ నాటౌట్‌గా నిలిచాడు. బెయిల్స్ లైట్ బ్లింక్ అయినా కిందపడకపోవడంతో అందరూ నోరెళ్లబెట్టారు. కామెంటేటర్స్ గట్టిగా అరుస్తూ.. 'ఇలా ఎలా జరిగింది? బంతి ఎలెక్ట్రా స్టంప్స్‌ను తాకినా కదల్లేదు'అని వ్యాఖ్యానించారు.

ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. నిక్ హబ్సన్(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48 నాటౌట్), కూపర్ కోన్నోల్లీ(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బ్రిస్బేన్ హీట్ 19.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. జిమ్మీ పీర్సన్(41 బంతుల్లో 7 ఫోర్లతో 42) మినహా అంతా విఫలమయ్యారు. స్కార్చర్స్ బౌలర్లలో ఆండ్రూ టై(4/14) నాలుగు వికెట్లు తీయగా.. లాన్స్ మోర్రీస్(3/26) మూడు వికెట్లు పడగొట్టారు.

Story first published: Saturday, January 13, 2024, 15:30 [IST]
Other articles published on Jan 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+