ఇంతకేం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్, పెర్త్ స్కాచర్స్ మధ్య శనివారం క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో సిడ్నీ బౌలర్ స్టీవ్ ఓ కీఫ్ వేసిన 13 వ ఓవర్ 5వ బంతిని మిచెల్ మార్ష్ ఫ్లిక్ చేయబోయాడు. కానీ బంతి మిస్సయ్యి కీపర్ చేతుల్లోకి వెళ్లగా సిడ్నీ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. దాంతో అంపైర్ మార్ష్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మార్ష్ అంపైర్‌పై గట్టిగా అరుస్తూ మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. మ్యాచ్ అనంతరం అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన అతను మార్షప్‌పై కఠిన చర్యలు తీసుకున్నాడు.

9 వికెట్లతో విజయం..
కాగా, ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టు పెర్త్ స్కార్చర్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్ 167 పరుగులు సాధించగా, సిడ్నీ జట్టు మరో 18 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు జోష్ ఫిలిప్(45), జేమ్స్ విన్స్ (53 బంతుల్లో 98 నాటౌట్) అద్భుతంగా ఆడి తమ జట్టుకు విజయాన్నందించారు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలోనే 92 పరుగుల జోడించి విజయానికి బాటలు వేసారు. ఇక హాఫ్ సెంచరీ ముంగిట ఫిలిప్పీ ఔటవ్వగా.. అనంతరం వచ్చిన డేనియల్ హగ్గీస్ ( 21 బంతుల్లో 1 ఫోర్ 21 నాటౌట్)తో కలిసి జేమ్స్ విన్స్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

సెంచరీ చేయకుండా కుట్ర..
ఇక 168 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసే సమయానికి సిడ్నీ సిక్సర్స్ 167/1తో నిలవగా.. జేమ్స్ విన్స్ 98 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దాంతో.. 18వ ఓవర్‌లో ఆండ్రూ టై బౌలింగ్‌కి రాగా.. బౌండరీ కొట్టడం ద్వారా సెంచరీని పూర్తి చేసుకుని మ్యాచ్‌ను కూడా ముగించాలనే ఆలోచనలో జేమ్స్ విన్స్ ఉన్నట్లు కనిపించింది. ఆ ప్లాన్‌లో భాగంగానే 17వ ఓవర్‌లో చివరి మూడు బంతుల్ని డేనియల్ ఎలాంటి పరుగు తీయకుండా డాట్ చేశాడు. కానీ.. 18వ ఓవర్ తొలి బంతినే లెగ్ సైడ్ దిశగా ఆండ్రూ టై వైడ్‌గా విసిరాడు. దాంతో.. జేమ్స్ విన్స్ ఆ బంతిని కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు.


Click it and Unblock the Notifications
