Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కళ్లుచెదిరే క్యాచ్‌.. సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి దూకి ఒంటిచేత్తో పట్టాడు (వీడియో)

BBL 10: Ben Laughlin takes Stunning Catch to dismiss Michael Neser

హైదరాబాద్: క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దాంతో ఎవరూ ఊహించని రీతిలో బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతుంటారు. ఎక్కువ శాతం ఫీల్డర్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. ఇప్పటికే ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం చూసే ఉంటాం. కానీ ఆసీస్ గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్‌ (బీబీఎల్) లీగ్‌లో తాజాగా నమోదైన క్యాచ్ మాత్రం కాస్త బిన్నం. బ్రిస్బేన్‌ హీట్‌ ఆటగాడు బెన్‌ లాఫ్లిన్‌ సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు.

 సూపర్‌మ్యాన్‌లా దూకుతూ:

సూపర్‌మ్యాన్‌లా దూకుతూ:

బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా శుక్రవారం బ్రిస్బేన్‌ హీట్‌, అడిలైడ్ స్టైకర్స్‌ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన అడిలైడ్ స్టైకర్స్‌ జట్టు మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. మార్నస్ లబుషేన్‌ 18వ ఓవర్ మూడో బంతికి ఫిలిప్ సాల్ట్ (26) ఔట్ అయ్యాడు. ఐదవ బంతికి అప్పుడే క్రీజులోకి వచ్చిన మైకేల్‌ నెసర్‌ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆఫ్‌స్టంప్‌ అవతలకు లబుషేన్‌ వేసిన లో ఫుల్‌టాస్‌ను నెసర్‌.. డీప్‌ మిడ్‌ వికెట్‌-లాంగ్‌ ఆన్ మీదగా భారీ షాట్ ఆడాడు. లాంగ్‌ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న బెన్‌ లాఫ్లిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు.

స్టన్నింగ్‌ డైవ్‌ క్యాచ్:

అటువైపు నుంచి మరో ఫీల్డర్ బౌండరీ ఆపేందుకు వస్తుండగా.. వేగంగా దూసుకొచ్చిన బెన్‌ లాఫ్లిన్ సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి దూకి ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆపై బ్రిస్బేన్‌ హీట్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ఫాన్స్ 'స్టన్నింగ్‌ డైవ్‌ క్యాచ్'‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'వాట్ ఏ క్యాచ్', 'సూపర్ ఫీల్డింగ్' అంటూ వీడియోకు కామెంట్లు వస్తున్నాయి. 'సూపర్‌మ్యాన్‌లా; లాఫ్లిన్‌‌ క్యాచ్‌ అందుకున్నాడని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఈ క్యాచ్ వీడియోను మీరూ చూడండి.

బ్రిస్బేన్‌ విజయం:

బ్రిస్బేన్‌ విజయం:

ఎలిమినేటర్ మ్యాచ్‌లో అడిలైడ్‌పై బ్రిస్బేన్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్‌ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. వెథర్‌ల్డాల్ట్ (32), ఫిలిప్ సాల్ట్ (26), వెల్స్ (20) పరుగులు చేశారు. క్యారీ (13), హెడ్ (12) విఫలమయ్యారు. లబుషేన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన బ్రిస్బేన్‌ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డెన్లి (41), పీర్సన్ (47) రాణించారు. పీర్సన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.

పంజాబీ సాంగ్ వింటూ.. హోటల్ గదిలో చెమటోడ్చుతున్న కోహ్లీ!! (వీడియో)

Story first published: Friday, January 29, 2021, 19:59 [IST]
Other articles published on Jan 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+