
సిడ్నీ: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్‌బాష్‌లీగ్(బీబీఎల్) 10వ సీజన్‌లో వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లెచర్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. మెల్‌బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆండ్రూ ఫ్లెచర్ హోబర్ట్ హరికేన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రెండు కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకొని ఔరా అనిపించాడు. తన సూపర్ ఫీల్డింగ్‌తో కీలక వికెట్లలో పాలుపంచుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
హరికేన్స్ ఇన్నింగ్స్‌లో ముందుగా సౌతాఫ్రికా ఆటగాడు కోలిన్ ఇంగ్రామ్(17) కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన ఫ్లెచర్ డైవ్ చేసి అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే తనదైన స్టెప్పులతో ఈ వికెట్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. అయితే ఈ వికెట్‌తో మ్యాచ్ రసవత్తరంగా మారింది. తర్వాత ధాటిగా ఆడుతున్న బెన్ మెక్‌డెర్మాట్(91)ను కూడా ఫ్లెచర్ మైమరిపించే ఫీల్డింగ్‌తో పెవిలియన్ చేర్చాడు. బెన్ బాదిన బంతి బౌండరీ వైపు దూసుకెళ్లగా ఆదిశలో ఫీల్డింగ్ చేస్తున్న ఫ్లెచర్ బ్రిలియంట్ క్యాచ్‌తో ఔట్ చేశాడు. మరోసారి తనదైన శైలిలో చిందేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఫ్లెచర్ పట్టిన రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 రన్స్ చేసింది. మార్కస్ స్టోయినిస్(97 నాటౌట్) పరుగుల విధ్వంసం సృష్టించాడు. అనంతరం హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరగులకే పరిమితమైంది. బెన్ మెక్‌డెర్మాన్(91) రాణించినా ఫలితం లేకపోయింది. ఫ్లెచర్ పట్టిన రెండు క్యాచ్‌లు ఆ జట్టు ఓటమిని శాసించాయి.