Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs CSK: సోదరుల యుద్ధం.. రాయల్స్‌కు అన్న.. చెన్నైకి తమ్ముడు!!

Battle of brothers: Sam Curran for Chennai and Tom Curran for Rajasthan

షార్జా: క్రికెట్ ఆటలో ఒకే జట్టుకు సోదరులు ఆడడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. యూసుఫ్ పఠాన్-ఇర్ఫాన్ పఠాన్, ఉమర్ అక్మల్- కమ్రాన్ అక్మల్, ఆల్బీ మోర్కెల్-మోర్ని మోర్కెల్, షాన్ మార్ష్-మిచెల్ మార్ష్, ఆండీ ఫ్లవర్-గ్రాంట్ ఫ్లవర్, మార్క్ వా-స్టీవ్ వా, గ్రెగ్ చాపెల్-ఇయాన్ చాపెల్, దీపక్ చహర్- రాహుల్ చహర్ ఇలా మరికొందరు సోదరులు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఐపీఎల్, సీపీఎల్, బీబీఎల్, పీఎస్‌ఎల్ లాంటి టీ20 లీగ్‌లు వచ్చాక ఈ సోదరులు ప్రత్యర్థులుగా తలపడ్డారు. యూసుఫ్ పఠాన్-ఇర్ఫాన్ పఠాన్, దీపక్ చహర్- రాహుల్ చహర్‌లు ఐపీఎల్ లీగ్‌లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఈసారి మరో ఇద్దరు తలబడబోతున్నారు.

సోదరుల పోరు

సోదరుల పోరు

ఐపీఎల్‌ 2020‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) మరో గెలుపుపై కన్నేసింది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్)‌తో చెన్నై మంగళవారం తలపడనుంది. ఈ మ్యాచులో తమ్ముడు సామ్ కరన్ చెన్నై తరఫున బరిలో దిగుతుండగా.. అన్న టామ్ కరన్ రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడనున్నాడు. లీగ్ ఆరంభ మ్యాచులో చహర్ సోదరులు తలపడగా.. ఈరోజు కరన్ సోదరులు తలపడనున్నారు. ఇద్దరిలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి.

సత్తాచాటిన సామ్

సత్తాచాటిన సామ్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వెన్ బ్రావోకు గాయం కావడంతో సామ్ కరన్ లీగ్ ఆరంభ మ్యాచులో ఆడాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సత్తాచాటాడు. మొదట బౌలింగ్‌లో ఒక వికెట్‌.. తర్వాత బ్యాటింగ్‌లో 6 బంతుల్లోనే 18 పరుగులు చేసి చెన్నై గెలుపుకు మార్గం సుగమం చేశాడు. కీలక సమయంలో కరన్ రెండు సిక్సులు, ఒక ఫోర్ బాది డుప్లెసిస్‌పై భారం తగ్గించాడు. దీంతో ఈరోజు మ్యాచులో అతడు ఉండడం ఖాయం. ఇక రాజస్థాన్‌ జట్టుకు పటిష్ట బౌలింగ్ లేనందున టామ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

బలహీనంగా లోయర్ ఆర్డర్

బలహీనంగా లోయర్ ఆర్డర్

రాజస్థాన్ రాయల్స్‌‌కు నాయకత్వం వహిస్తోన్న స్టీవ్ స్మిత్ గాయం నుంచి కోలుకున్నాడు. చెన్నై మ్యాచులో అతడు బరిలోకి దిగనున్నాడు. రాజస్థాన్ వికెట్‌ కీపర్ జోస్ బట్లర్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. కుటుంబంతో పాటు యూఏఈ వచ్చిన బట్లర్.. క్వారంటైన్లో ఉన్నాడు. ఇక వ్యక్తిగత కారణాలతో న్యూజిలాండ్ వెళ్లిన బెన్ స్టోక్స్ టోర్నీ ఆడుతాడో లేదో తెలియదు. దీంతో రాయల్స్ లోయర్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తుండగా.. డేవిడ్ మిల్లర్, టామ్ కరన్ బరిలో దిగే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు

రాజస్థాన్ రాయల్స్ జట్టు

యశస్వి జైస్వాల్, రాబిన్ ఉతప్ప/మనన్ వోహ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, టామ్ కరన్, అంకిత్ రాజ్‌పుత్/కార్తీక్ త్యాగి.

RR vs CSK: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌.. ఎంఎస్ ధోనీని ఊరిస్తోన్న మూడు రికార్డులు ఇవే!!

Story first published: Tuesday, September 22, 2020, 17:30 [IST]
Other articles published on Sep 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+