Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లోనే బిత్తిరి ఘటన.. బ్యాటర్ బౌల్డ్ అయినా గుర్తించని ఫీల్డింగ్ టీమ్! (వీడియో)

Batter Gets Bowled But Shockingly Survives In Australias Women Domestic Match

సిడ్నీ: క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఆసక్తికర, ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకోవడం చూస్తుంటాం. కానీ ఆస్ట్రేలియా మహిళల దేశవాళీ క్రికెట్‌లో చోటు చేసుకున్న ఓ బిత్తిరి ఘటన ఇప్పటి వరకు కనివిని ఎరుగుండరు! క్రికెట్‌లో బ్యాటర్‌ను ఔట్ చేయడానికి ఫీల్డింగ్ టీమ్ శతవిధాల ప్రయత్నిస్తుంటుంది. ఔట్ చేయడానికి ఉన్న వ్యూహాలన్నీ ఉపయోగిస్తుంటుంది. కానీ ఆస్ట్రేలియా మహిళల దేశవాళీ క్రికెట్‌లో బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయినా.. పెవిలియన్ చేరకుండా బ్యాటింగ్ కొనసాగించింది. అసలు బ్యాటర్ ఔటైన విషయాన్నే ఫీల్డింగ్ టీమ్ గుర్తించలేకపోయింది. కీపర్, బౌలర్‌తో పాటు ఫీల్డర్లంతా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారు. అంపైర్లు కూడా అలసత్వం ప్రదర్శించారు.

అయితే టీవీ రీప్లేలో బౌలర్ విసిరిన బంతి వికెట్లపై ఉన్న బెయిల్స్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా, దాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో ఆ బ్యాటర్‌ ఔటవ్వకుండా బతికిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కీపర్, బౌలర్, ఫీల్డర్లంతా మబ్బుగాళ్లే ఉన్నారుగా! అని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

అసలేం జరిగిందంటే.. తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌, టాస్మానియా జట్ల మధ్య ఒక వన్డే మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా క్వీన్స్‌లాండ్‌ బ్యాటర్‌ జార్జియా వోల్‌ 26 పరుగుల వద్ద .. సారా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయింది. బంతి బ్యాట్‌ను దాటుకుంటూ వెళ్లి ఆఫ్‌ స్టంప్‌పైనున్న బెయిల్స్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో అవి కిందపడ్డాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అయినా అక్కడే ఉన్న కీపర్‌ ఈ విషయాన్ని గుర్తించలేదు.. మరోవైపు బౌలర్‌ అప్పీల్‌ చేయలేదు. దీంతో అంపైర్లు కూడా పట్టించుకోలేదు.

కీపర్ గ్లోవ్స్‌ తాకి బెయిల్స్‌ పడి ఉండొచ్చని అంతా అనుకున్నారు. దీంతో బ్యాటర్‌ కూడా ఈ విషయంలో మిన్నకుండిపోయింది. అయితే, రీప్లేలో ఆ బంతి బెయిల్స్‌ అంచులు తాకుతూ వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా, అప్పటికే బ్యాటర్‌ బతికిపోయింది. చివరికి 31 పరుగుల వద్ద జార్జియా ఔటైంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్వీన్స్‌లాండ్‌ 48 ఓవర్లకు (డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం) 223/6 స్కోర్‌ చేసింది. అనంతరం టాస్మానియా 232 పరుగులు చేసి విజయం సాధించింది.

Story first published: Monday, December 20, 2021, 16:40 [IST]
Other articles published on Dec 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+