Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్తర్ తప్పబ్బా.. ఐపీఎల్ కోసం ప్రపంచకప్ వాయిదా పడలేదు : పాక్ మాజీ క్రికెటర్

Basit Ali rubbishes Shoaib Akhtars allegation that BCCI forced cancellation of T20 World Cup

కరాచీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ కోసం టీ20 ప్రపంచకప్ వాయిదా వేసారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ మాజీ ఆటగాడు బసిత్ అలీ తప్పుపట్టాడు. టీ20 ప్రపంచకప్ వాయిదా నిర్ణయం ఇప్పుడు తీసుకుంది కాదన్నాడు. కరోనా ప్రభావం మొదలైన ప్రారంభంలోనే ఆతిథ్య ఆస్ట్రేలియా మెగాటోర్నీని తాము నిర్వహించలేమని చేతులెత్తేసిందని తెలిపాడు. కానీ అప్పుడు ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్ భారత క్రికెట్ బోర్డుకు వ్యతిరేకంగా వాయిదా నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆలస్యం చేశాడని బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్‌లో పేర్కొన్నాడు.

శశాంక్ కుట్ర అది..

శశాంక్ కుట్ర అది..

‘టీ20 ప్రపంచకప్ వాయిదా విషయంలో బీసీసీఐ పాత్ర లేదు. ఐసీసీ మాజీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ కారణంగా వాయిదా ప్రకటన ఆలస్యమైంది. టీ20 ప్రపంచకప్ ప్రారంభ తేదిలకు ఒక నెలముందు వాయిదా ప్రకటన చేయాలని ప్రణాళికలు రచించాడు. అలా చేస్తే బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించలేదని కుట్ర పన్నాడు. భారత అభిమానులకు ఇది నచ్చకపోవచ్చు. కానీ ఇదే సత్యం.'అని తెలిపాడు.

అండగా నిలిచింది బీసీసీఐ..

అండగా నిలిచింది బీసీసీఐ..

ఇక వచ్చే ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ విండో మారడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అండగా నిలిచింది బీసీసీఐనే అని బసిల్ తెలిపాడు. ‘గత సోమవారం జరిగిన ఐసీసీ కార్యవర్గ సమావేశంలో టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి విండోలా నిర్వహించాలనుకున్నారు. అయితే దీనికి పీసీబీ అంగీకరించలేదు. ఆ సమయంలో తమకు పీఎస్ఎల్ ఉంటుందని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పింది.

ఆ సమయంలో పీసీబీకి అండగా బీసీసీఐ వాదించింది. ఓ లీగ్‌ను విత్‌డ్రా చేసుకోవడం ఆశమాషి వ్యవహారం కాదని తెలిపింది. ఆ తర్వాత ఈసీబీ కూడా పాక్ బోర్డుకు ఫేవర్‌గా మాట్లాడింది. దీంతో వెనక్కు తగ్గిన ఐసీసీ అక్టోబర్-నవంబర్ విండోకు మార్చింది. అయితే ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లలో ఈ మెగాటోర్నీని నిర్వహించాలనే ఉద్దేశంతో ఐసీసీ ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించాలనుకుంది.'అని బసిత్ అలీ చెప్పుకొచ్చాడు.

డబ్బుల కోసమే..

డబ్బుల కోసమే..

ఆర్థికంగా లాభపడటం కోసమే క్రికెట్ బోర్డులన్నీ ప్రపంచకప్ వాయిదా నిర్ణయానికి అంగీకరించాయని షోయబ్ అక్తర్ ఆరోపించాడు. టీ20 ప్రపంచకప్‌ కాకుండా ఐపీఎల్‌ జరిగితేనే ఆదాయం వస్తుందని భావించిన క్రికెట్‌ బోర్డులు.. ఐసీసీని ప్రభావితం చేశాయన్నారు. ‘శక్తిమంతమైన క్రికెట్‌ బోర్డు విధానాలను రూపొందిస్తుంది. వారి వల్ల ఇతరులు కూడా బాధపడాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌, ఆసియా కప్‌ ఈ ఏడాది జరగాల్సింది. అప్పుడు భారత్‌-పాకిస్తాన్ జట్ల మధ్య‌ మ్యాచ్‌ ఉండేది. కానీ వారలా చేయలేదు. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వాటిని చెప్పలేను. టీ20 ప్రపంచకప్‌ జరగదని నేను ఎప్పట్నుంచో చెబుతున్నా. టీ20 ప్రపంచకప్‌కు ఏమైనా ఫర్వాలేదు కానీ ఐపీఎల్‌కు ఏం జరగొద్దు. క్రికెట్‌ నాణ్యత దెబ్బతింటున్నప్పటికీ ఆట నుంచి లక్షల డాలర్లు సంపాదించడమే వారికి ముఖ్యం' అని అక్తర్‌ ఫైర్ అయ్యారు.

అందరూ కలిసే చేశారు..

అందరూ కలిసే చేశారు..

అదే షోలో రషీద్‌ లతీఫ్‌ మాట్లాడుతూ... 'భారత్‌, పాకిస్థాన్‌, ఇంగ్లండ్ మరేదైనా కానివ్వండి. అన్ని బోర్డులూ ఆర్థిక ప్యాకేజీల కోసమే చూస్తున్నాయి. బీసీసీఐ ఒక్కటే కాదు ఈ వ్యవహారంలో అన్ని బోర్డులూ ఐకమత్యంగానే ఉన్నాయి. ఫిబ్రవరి-మార్చిలో టీ20 ప్రపంచకప్‌ పెట్టొచ్చు. కానీ పీఎస్‌ఎల్‌కు నష్టం. ఏప్రిల్‌-మే అయితే ఐపీఎల్‌కు, నవంబర్‌-డిసెంబర్‌ అయితే బిగ్‌బాష్‌కు నష్టం. అందుకే ఐసీసీ నిర్ణయంలో అన్ని బోర్డులూ ప్రయోజనం వెతుకున్నాయి. ఆసియా కప్‌ వాయిదాపై సౌరవ్ గంగూలీ ముందుగానే చెప్పాడంటే అతడికి పాక్‌ లేదా లంక బోర్డులే చెప్పుండాలి' అని అన్నారు.

Story first published: Thursday, July 23, 2020, 21:31 [IST]
Other articles published on Jul 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+