ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. పాకిస్థాన్‌తో తృటిలో చేజారిన పరాజయం నుంచి త్వరగానే కోలుకుంది. గ్రూప్-ఏలో భాగంగా మంగళవారం ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బాస్ డీ లీడే(72 నాటౌట్, 2/20) ఆల్‌రౌండ్ షోతో నెదర్లాండ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. జాన్ నికోల్ లాఫ్టీ(38 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 42), జాన్ ఫ్రైలింక్(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా బ్యాటర్లలో నలుగురు మాత్రమే రెండెంకలే స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే(2/20), లోగన్ వాన్ బ్రీక్(2/13) రెండేసి వికెట్లు తీయగా.. ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం నెదర్లాండ్స్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. బాస్ డి లీడే(48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కొలిన్ అకెర్‌మన్(38 బంతుల్లో సిక్స్‌తో 32), మైఖేల్ లెవిట్(15 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వెర్డ్స్(9 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 18 నాటౌట్) దూకుడుగా ఆడాడు. నమీబియా బౌలర్లలో బెర్నాడ్, రుబెన్, జాన్ నికోల్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆ జట్టు అమెరికా, భారత్‌తో ఆడనుంది.