న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్‌‌కు ఊరట!

 Baroda Cricket Association withdraws suspension on Atul Bedade but removes him as womens coach

వడోదరా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్‌ అతుల్‌ బెదాడేకు భారీ ఊరట లభించింది. అతనిపై విధించిన సస్పెన్షన్‌ను బరోడా క్రికెట్‌ అసోసియేషన్ (బీసీఏ) తొలగించింది. అయితే సీనియర్‌ మహిళా జట్టు హెడ్‌ కోచ్‌ పదవి నుంచి మాత్రం అతన్ని తప్పించింది. 'ఆరోపణల నేపథ్యంలో అతనిపై ప్రాథమిక విచారణ చేశాం. ఉన్నతస్థాయి కమిటీ... అతనిపై వచ్చిన ఆరోపణలు, జరిగిన విచారణపై చర్చించింది. అనంతరం ఈ సమస్యకు ముగింపు పలికిన కమిటీ బెదాడేపై సస్పెన్షన్‌ను తొలగించింది. అయితే సున్నితమైన ఈ అంశంపై వివాదం రేపకూడదన్న ఉద్దేశంతోనే మహిళా క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా అతన్ని కొనసాగించలేదు'అని బీసీఏ కార్యదర్శి అజిత్‌ లెలె బుధవారం మీడియాకు తెలిపారు. త్వరలోనే బరోడా మహిళా జట్టుకు అంజూ జైన్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించనున్నారు.

ఇక ఈ ఏడాది మార్చిలో బెదాడే కోచ్ ముసుగులో తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కొందరూ మహిళా క్రికెటర్లు బీసీఏకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ప్రాథమిక విచారణ జరిపిన బీసీఏ అతనిపై వేటు వేసింది. ఈ మేరకు అప్పట్లో బెదాడేకు లేఖ రాసిన కార్యదర్శి అజిత్‌ లెలె పలు అంశాలు వెల్లడించారు.

'మహిళా క్రికెటర్ల శారీరక విషయాల గురించి, వారి ఆరోగ్య విషయాల గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర భాష మాట్లాడటం, లైంగికపరమైన అంశాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేయడంలాంటివి.. బెదాడేపై వచ్చిన ప్రధాన ఆరోపణలు'అని అప్పట్లో ఆయన చెప్పారు. క్రికెటర్ల రాతపూర్వక ఫిర్యాదు తర్వాత తాము విచారణ జరపడంతో అనేక విషయాలు బయటపడ్డాయని లెలె తెలిపారు. 53 ఏళ్ల అతుల్‌ బెదాడే 1994లో భారత్‌ తరఫున 13 వన్డేలు ఆడి 22.57 సగటుతో 158 పరుగులు చేశాడు. బరోడా పురుషుల జట్టు హెడ్ కోచ్ అయిన బెదాడే.. గతేడాదే మహిళల జట్టు బాధ్యతలు కూడా తీసుకున్నాడు.

Story first published: Thursday, June 4, 2020, 11:03 [IST]
Other articles published on Jun 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X