
హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఈ రోజు తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మరికొద్ది క్షణాల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కవ్వించే ప్రయత్నం చేసింది. ట్విటర్ వేదికగా ఆరెంజ్ జ్యూస్ ఫొటోను షేర్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీమ్.. సన్‌రైజర్స్ ఆటగాళ్ల జ్యూస్‌ను పిండేస్తామని పరోక్షంగా హెచ్చరించింది. అయితే ట్వీట్‌పై హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదైన శైలిలో తిప్పికొడుతన్నారు.
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దాంతో ఈసారి పేపర్‌పై బలంగా కనిపిస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం యువ ఆటగాళ్లతో నిండి ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అన్‌పేపర్‌పై తమ జట్టు బలంగా ఉండటంతోనే రాజస్థాన్ రాయల్స్ కవ్వింపులకు దిగింది. అయితే వాపును చూసి బలుపు అనుకుంటే నష్టపోతారని హైదరాబాద్ అభిమానులు బదులిస్తున్నారు.
రికార్డుల పరంగా చూస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 8 విజయాలు సాధించగా.. ఆర్‌ఆర్ 7 విజయాలందుకుంది. గతంలో కూడా ఆర్‌ఆర్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ముందు ఇలాంటి పోస్టే చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. 2020 సీజన్ రెండో మ్యాచ్‌కు ముందు 'ఈ రాత్రికి హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ చేయాలి'అంటూ పోస్టు చేసింది. అయితే, ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ కొట్టిన దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తాజాగా ఆర్‌ఆర్ మరోసారి అలాంటి ట్వీటే చేయడంతో.. ఈసారి కూడా అలాంటి పరాజయం తప్పదని హైదరాబాద్ అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు.