Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్‌ను ఓడించిన తర్వాత ఆసుపత్రిపాలైన బంగ్లాదేశ్ కెప్టెన్!

వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ సరికొత్త చరిత్రను సృష్టించింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2 1తో కైవసం చేసుకుంది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. అయితే ఈ మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ మెహ్‌దీ హసన్ ఆసుపత్రిపాలయ్యాడు.

రాకాసి బౌన్సర్‌తో..

బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా ఆస్ట్రేలియా పేసర్ రైలీ మెరెడిత్ వేసిన 34వ ఓవర్‌లో మెహిదీ హసన్ తీవ్రంగా గాయపడ్డాడు. రైలీ మెరెడిత్ వేసిన బౌన్సర్.. మెహిదీ హసన్ హెల్మెట్ పక్క భాగాన్ని బలంగా తాకింది. దాంతో అతను క్రీజులో కుప్పకూలాడు. బంగ్లాదేశ్ ఫిజియో పెజ్జెతుల్ ఇస్లాం ఖాన్, ఆస్ట్రేలియా వైద్య బృందం హుటాహుటిన పరుగెత్తుకొచ్చారు.

Bangladesh Star Mehidy Hasan Miraz Hospitalized After Leading Historic ODI Series Victory vs Australia

మైదానంలోనే వాంతులు..

అతనికి ప్రథమ చికిత్స అందిస్తుండగా.. మెహిదీ హసన్ మైదానంలోనే వాంతులు చేసుకోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ సన్నివేశాలు భయానక పరిస్థితులను కల్పించాయి. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి స్ట్రెచర్‌ను మైదానంలోకి తీసుకురాగా.. మెహ్‌దీ హసన్ నిరాకరించాడు. బ్యాటింగ్ చేయగలనని చెప్పి ఫిజియోలను బయటకు పంపించాడు. తీవ్రమైన నొప్పితోనే బ్యాటింగ్ కొనసాగించిన మెహిదీహసన్.. సిక్సర్ కొట్టి బంగ్లాదేశ్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

మ్యాచ్ ముగిసిన వెంటనే ఆసుపత్రికి..

మ్యాచ్ ముగిసిన వెంటనే మెహిదీ హసన్‌ను ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు. టీమ్ ఫిజియో మాట్లాడుతూ.. మెహిదీ హసన్‌కు స్వల్ప గాయమే అయ్యిందని, ముందస్తు చర్యల్లో భాగంగానే ఆసుపత్రికి తరలించామని తెలిపాడు. ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడని చెప్పాడు. మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని తెలిపాడు.

మెహిదీ హసన్ ఆసుపత్రికి వెళ్లడంతో నజ్ముల్ హుస్సేన్ షాంటో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మెహిదీ హసన్ క్షేమంగా ఉన్నాడని చెప్పిన నజ్ముల్.. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలవడం వర్ణించలేనిఅనుభూతి అని చెప్పాడు.

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసి డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మెహ్‌దీ హసన్ మిరాజ్(22 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 22 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Story first published: Friday, June 12, 2026, 17:01 [IST]
Other articles published on Jun 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+