BAN v AUS:టీ20ల్లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు.. బంగ్లాదే టీ20 సిరీస్!

ఢాకా: బంగ్లాదేశ్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టుకు మరో పరాభావం ఎదురైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన ఆఖరి టీ20లో 60 పరుగుల తేడాతో చిత్తయింది. గత మ్యాచ్‌లో విజయం సాధించిన ఆసీస్ చివరి మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(4/9) సూపర్ బౌలింగ్‌తో ఆసీస్ పతనాన్ని శాసించాడు. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను బంగ్లా 4-1తో సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై ఆ జట్టుకు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. దాంతో తాము పసికూనలం కాదని బంగ్లాదేశ్ యావత్ క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది.

23 టాప్ స్కోర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగుల స్కోర్ చేసింది. మహమ్మద్ నైమ్(23) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఇతర బ్యాట్స్‌మెన్ మెహ్‌దీ హసన్(13), షకీబ్ అల్ హసన్(11), సౌమ్యా సర్కార్(16), మహ్మదుల్లా(19) కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎలిస్(2/16), డాన్ క్రిస్టియన్(2/17) చెరో రెండు వికెట్లు తీయగా.. టర్నర్, అగర్, జంపా తలో వికెట్ పడగొట్టారు.

9 మంది సింగిల్ డిజిట్..
అనంతరం చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో షకీబ్ దెబ్బలకు ఆసీస్ 13.4 ఓవర్లలో 62 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్, కీపర్ మాథ్యూ వేడ్(22) టాప్ స్కోరర్‌గా కాగా.. మెక్ డెర్మాట్(17) మినహా మిగతా 9 మంది బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ నాలుగు వికెట్లకు తోడు మహమ్మద్ సైఫుద్దీన్ మూడు, నసమ్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. మహ్మదుల్లాకు ఓ వికెట్ దక్కింది. ఈ క్రమంలోనే షకిబ్ పొట్టి క్రికెట్లో 100 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. మొత్తంగా 102 వికెట్లతో ఉన్నాడు. షకిబ్ కంటే ముందు.. మలింగ మాత్రమే టీ-20ల్లో 100 వికెట్లు తీశాడు.

చెత్త రికార్డు ..
ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా ఓ చెత్తరికార్డును ఖాతాలో వేసుకుంది. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోర్. 2005లో సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులుకు ఆలౌటైన ఆసీస్.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యల్పంగా 62 స్కోర్‌కు కుప్పకూలింది. 2014లో ఇదే డాకా వేదికగా భారత్ చేతిలో 86 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. పాకిస్థాన్ చేతిలో రెండు సార్లు 89 పరుగులకు కుప్పకూలింది. టీ20 క్రికెట్‌లో ఇవే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా అత్యల్ప స్కోర్లు.
ఆసీస్ టాప్-5 అత్యల్ప స్కోర్లు..
| స్కోర్ | ప్రత్యర్థి | వేదిక | సవంత్సరం |
| 62 | బంగ్లాదేశ్ | ఢాకా | 2021 |
| 79 | ఇంగ్లండ్ | సౌతాంప్టన్ | 2005 |
| 86 | భారత్ | ఢాకా | 2014 |
| 89 | పాకిస్థాన్ | దుబాయ్ | 2012 |

కారణం ఇదే..
ఆస్ట్రేలియా ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి. ముందుగా ఈ సిరీస్‌ను లైట్ తీసుకోవడం.. సీనియర్ ఆటగాళ్లందరికి విశ్రాంతినిచ్చి అనుభవం లేని ద్వితీయ శ్రేణి జట్టును పంపించడం ఆ జట్టు కొంపముంచింది. బిగ్ బాష్ లీగ్ ఆడిన అనుభవం కలిగిన ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడం కూడా ఆ జట్టు పతనాన్ని శాసించింది. అంతేకాకుండా స్పిన్ పిచ్‌లు ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాయి. ఆతిథ్య జట్టు పూర్తిగా తమకు అనుకూలమైన ఏక పక్ష పిచ్‌లను సిద్దం చేసుకోవడం కూడా ఆసీస్ ఓటమికి కారణమైంది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా 150 ప్లస్ స్కోర్లు నమోదు కాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. పిచ్‌పై ఎంత టర్న్ ఉందో.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications