బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ20లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాటర్ టస్కిన్ అహ్మద్ భారీ సిక్సర్ బాదాగా అంపైర్ ఔటిచ్చాడు. దాంతో అంతా అవాక్కయ్యారు. కానీ బ్యాటర్ హిట్ వికెట్ అయ్యాడని తెలిసి నోరెళ్లబెట్టారు. సోమవారం జరిగిన తొలి టీ20లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
షై హోప్ హిట్‌వికెట్‌తో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగియగా.. వెస్టిండీస్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెఫెర్డ్ వేసిన ఆఖరి ఓవర్ నాలుగో బంతిని టస్కిన్ అహ్మద్ భారీ సిక్సర్ బాదాడు. కానీ ఈ షాట్ ఆడే క్రమంలో స్టంప్స్‌ను తొక్కేసాడు. దాంతో అంపైర్ ఔటవ్వగా.. టస్కిన్ అహ్మద్ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 165 పరుగులు చేసింది. అలిక్ అథనాజే(34), బ్రాండన్ కింగ్(33), షైహోప్(46 నాటౌట్), రోవ్‌మన్ పోవెల్(44 నాటౌట్) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్(2/36) రెండు వికెట్లు తీయగా.. రిషద్ హొస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. తంజిమ్ హసన్ సకీబ్(27 బంతుల్లో 3 ఫోర్లతో 33), టౌహిడ్ హృదయ్(28) రాణించినా ఫలితం లేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో జైడన్ సీల్స్, జాసన్ హోల్డర్ మూడేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖారీ పిర్రే, రొమారియో షెఫెర్డ్ తలో వికెట్ తీసారు.