పుష్ప సినిమా బాగా నచ్చిందబ్బా: బంగ్లాదేశ్ క్రికెటర్

హైదరాబాద్: టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప క్రేజ్ మామూలుగా లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఎంతలా అంటే ఇంటర్నేషన్‌ల్ స్టార్ క్రికెటర్లంతా ఈ మూవీ సాంగ్స్, డైలాగ్స్ ఇమిటేట్ చేసేంత. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీలోని 'నీ అవ్వ తగ్గేదేలే' డైలాగ్, ఊ అంటావా మామ, శ్రీవల్లీ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన డైలాగ్, పాటలను ఇమిటేట్ చేయగా.. రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా తదితరులు కూడా నీ అవ్వ తగ్గేదేలే డైలాగ్‌తో రచ్చ చేశారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాకే పరిమితమైన పుష్ప క్రేజ్.. ఇప్పుడు క్రికెట్ మైదానానికి కూడా పాకిన విషయం తెలిసిందే.

నజ్మూల్ ఇస్లామ్..
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో నజ్మూల్ ఇస్లామ్ అనే బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో 'నీ అవ్వ తగ్గేదేలే'అనే అల్లు అర్జున్ మ్యానరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట కూడా వైరల్ అయింది. బీబీఎల్‌లో జరిగిన ఓ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన నజ్మూల్ ఊరించే బంతితో బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించాడు.
ఎక్స్‌ట్రా కవర్ దిశగా బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్‌ను ఫీల్డర్ పరుగెత్తి అద్బుతంగా అందుకున్నాడు. దాంతో నజ్మూల్ అల్లు అర్జున్ డైలాగ్ తగ్గేదే లే డైలాగ్‌కు సంబంధించిన మేనరిజాన్నీ ప్రదర్శించాడు. గడ్డం కింద నుంచి చేయి అడ్డంగా జరుపుతూ సంబరాలు చేసుకున్నాడు.
బాగా నచ్చిందబ్బా..
అయితే మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్ట్ హోస్ట్ ఆ ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్ గురించి ప్రశ్నించగా.. నజ్మూల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే తాను పుష్ప సినిమా చూశానని, తనకు బాగా నచ్చిందని తెలిపాడు. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యానని, అతని మ్యానరిజం బాగా నచ్చిందని చెప్పాడు.
దాంతోనే వికెట్ తీసిన తర్వాత తగ్గేదేలే అంటూ సెలెబ్రేట్ చేస్తుకున్నానని తెలిపాడు. ఆ మూవీ చూసినప్పుటి నుంచి అదే ట్రాన్స్‌లో ఉన్నానని తెలిపాడు. పుష్ప సినిమాలోని పుష్ఫరాజ్‌లా సవాళ్లు స్వీకరించడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
బన్నీ ఫ్యాన్స్ ఫిదా..
ఈ వీడియోకు సంబంధించిన ట్వీట్‌ను పుష్ప అధికారిక ట్విటర్ హ్యాండిల్ రీట్వీట్ చేసింది. దాంతో తెలుగు అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. ‘బన్నీనా మజాకా.. నీ అవ్వ తగ్గేదేలే'.. పుష్ఫ.. పుష్ప రాజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. బన్నీ సినిమా అంటే ప్రపంచం మొత్తం షేక్ అవ్వాల్సిందే అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సైతం పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట స్టెప్పులేసాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలంతా పుష్ప ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications