భళా బంగ్లా క్రికెటర్లు.. కరోనా కట్టడికి సగం జీతం విరాళం

ఢాకా: కరోనాపై యుద్దం చేసేందుకు బంగ్లాదేశ్ క్రికెటర్లు ముందుకొచ్చారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి తమ వంతు సాయంగా నెల జీతాల్లో సగాన్ని విరాళంగా ప్రకటించారు. మొత్తం 27 మంది నేషనల్ క్రికెటర్లు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకురాగా.. ఇందులో కేవలం 17 మందికి మాత్రమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ఉన్నాయి. మిగిలిన వాళ్లు కూడా బంగ్లా జాతీయ జట్టుకు ఆడినవారే.
'ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతుంది. బంగ్లాదేశ్‌లోనూ ఈ మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన క్రికెట్లరుగా ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే.. అవగాహన కల్పించడం కాకుండా ప్రభుత్వానికి సాయం చేద్దామని నిర్ణయించుకున్నాం. దీంతో మా 27 క్రికెటర్ల నెల జీతాల్లో సగాన్ని కరోనా వైరస్ కట్టడి కోసం విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాం. ట్యాక్స్‌లన్నీ పోను ఆ మొత్తం రూ. 25 లక్షల టాకాలు ఉండొచ్చు ' అని బంగ్లాదేశ్ క్రికెటర్లు ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక కరోనా వైరస్‌పై చేసే పోరాటంలో ఈ ఫండ్ చాలా చిన్నిది కావచ్చని, కానీ అందరూ తలో చేయి వేస్తే ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చన్నారు. ఇక బంగ్లా క్రికెటర్లను ముద్దుగా పులులు అని పిలిచే తమ అభిమానులు.. వారి సాయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం బంగ్లా అభిమానులే కాదు.. యావత్ క్రికెట్ ప్రపంచం వారికి సలాం చెబుతుంది. మీరు నిజంగా పులులేనని కొనియాడుతోంది.
ఇక రోనా వైరస్ కట్టడి కోసం మార్చి 26 నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం 10 రోజులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించనుంది. ఈ మహమ్మారితో ఇప్పటికి బంగ్లాలో ఐదుగురి మరణించారు. అయితే గడిచిన 24 గంటల్లో బంగ్లాదేశ్‌లో కనీసం ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదుకాకపోవడం ఊరటనిచ్చే అంశం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications