For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా మాజీ కోచ్‌కు బంగ్లాదేశ్ బంపరాఫర్!!

Bangladesh approaches Sanjay Bangar for Test batting consultant

ఢాకా: టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) బంపరాఫర్ ప్రకటించింది. టెస్టుల్లో తమ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉండాలని అతడిని కోరింది. ఈ ఆఫ‌ర్‌ను సంజయ్ బంగర్ స్వీకరిస్తే జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ జట్టుకు అతడిని టెస్టు బ్యాటింగ్‌ సలహాదారుడిగా చూడొచ్చు.

ఇక సంజయ్ బంగర్‌ను సంప్రదించిన విషయాన్ని బీసీబీ ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌ నిజాముద్దీన్‌ చౌదరీ బుధవారం మీడియాకు తెలిపారు. 'మేము సంజయ్‌ బంగర్‌తో ఈ విషయం చర్చించాం.. కానీ తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ బంగర్‌ రాలేని అవకాశం ఉంటే మిగతావాళ్లతో కూడా టచ్‌లో ఉంటాము' అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇప్పటికే బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్‌ మెకెంజీ కొనసాగుతున్నాడు. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌ బ్యాటింగ్‌ సలహాదారుడి కోసం బీసీబీ అన్వేషణ మొదలుపెట్టింది.

కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. ఇక సంజయ్‌ బంగర్‌ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేసిన విషయం తెలసిందే. ఒకవేళ బంగర్‌ బంగ్లా జట్టుకు టెస్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా వస్తే మాత్రం జూన్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు కొనసాగే అవకాశం ఉంది.

Story first published: Wednesday, March 18, 2020, 19:32 [IST]
Other articles published on Mar 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+