Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BAN vs SL: మాథ్యూస్ టైమ్ ఔట్.. ఫోర్త్ అంపైర్ వివరణ! (వీడియో)

BAN vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ టైమ్‌ ఔట్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి. బ్యాటర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోకపోవడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీల్ చేశాడు. దాంతో నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు.

టైమ్ ఔట్ అంటే ఏంటి..?
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) రూల్స్ ప్రకారం... ఒక బ్యాటర్ ఔటైనా తర్వాత క్రీజులోకి వచ్చే మరో ఆటగాడు 3 నిమిషాల్లోపు(180 సెకండ్లు) బంతిని ఎదుర్కోవాలి. అలా కాకుండా ఆలస్యం చేస్తే ఇన్‌కమింగ్ బ్యాటర్‌ను టైమ్ ఔట్‌గా ప్రకటిస్తారు.

 BAN vs SL: What is time out? Fourth umpire Adrian Holdstock explains Angelo Mathews dismissal

అయితే ఏంజెలో మాథ్యూస్ విషయంలో 2 నిమిషాలనే పరిగణలోకి తీసుకున్నారు. ఈ వివాదాస్పద ఘటనపై ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్ట్‌స్టాక్ వివరణ ఇచ్చాడు. ఐసీసీ ప్రపంచకప్ రూల్స్.. ఎంసీసీ కంటే కాస్త భిన్నంగా ఉంటాయని తెలిపాడు. ఐసీసీ ప్రపంచకప్ రూల్స్ ప్రకారం.. బ్యాటర్ ఔటైనా తర్వాత ఇన్‌కమింగ్ బ్యాటర్ 120 సెకన్లలోపు(2 నిమిషాలు) మరో బంతిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాడు.

వరల్డ్ కప్‌లో 2 నిమిషాలు..?
'ప్లేయింగ్ కంట్రోల్ రూమ్‌లో టీవీ అంపైర్‌తో పాటు ఫోర్త్ అంపైర్ కొన్ని ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తారు. వికెట్ పడిన వెంటనే టీవీ అంపైర్ ప్రాథమికంగా రెండు నిమిషాలు ఎదురు చూసి అప్పటికి ఆట ప్రారంభం కాకపోతే ఫీల్డ్ అంపైర్‌తో సంప్రదింపులు జరుపుతాడు.

ఈ మ్యాచ్‌లో బ్యాటర్ తన హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోయిందని గమనించే సమయానికికే 2 నిమిషాలు పూర్తయింది. నిర్ణీత సమయానికి అతను బంతిని ఎదుర్కొనేందుకు సిద్దంగా లేడు. ఫీల్డింగ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్... స్టాండింగ్ అంపైర్ ఎరాస్మస్‌కు అప్పీల్ చేశాడు. దాంతో అతను ఔటిచ్చాడు.

బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చే ముందే హెల్మెట్, ప్యాడ్స్, గాడ్, గ్లోవ్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మరోలా చెక్ చేసుకునేందుకు 50 సెకన్లు ముందుగానే క్రీజులోకి రావాలి. లేదంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి.'అని హోల్డ్ స్టేక్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, November 6, 2023, 22:02 [IST]
Other articles published on Nov 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+