For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

BAN vs SL: 10 సెకన్ల ముందే ఔటిచ్చారు.. మరో పంచాయితీకి తెరలేపిన స్టార్ స్పోర్ట్స్!

BAN vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ టైమ్‌ ఔట్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ ఔటైన తర్వాత 2 నిమిషాల వ్యవధిలో మరో ఆటగాడు క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కోవాలి. కానీ ఏంజెలో మాథ్యూస్.. నిర్ణీత సమయంలో మరో బంతిని ఆడలేకపోయాడు. క్రీజులోకి త్వరగానే వచ్చినా.. హెల్మెట్ స్ట్రిప్ ఊడిపోవడంతో మరొకటి తీసుకురావాలని తమ డగౌట్‌‌‌కు సూచించాడు. బంతి ఆడకుండా హెల్మెట్ తీసుకొచ్చే వరకు వేచి చూసాడు.

BAN vs SL: Star Sports showing Angelo Mathews reached his crease 10 seconds

దాంతో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంతో ఖంగుతిన్న మాథ్యూస్.. అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. తాము ఏం చేయలేమని, షకీబ్‌తో మాట్లాడుకోవాలని సూచించారు. హెల్మెట్ కారణంగా ఆలస్యమైందని, అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని షకీబ్‌ను మాథ్యూస్ కోరగా.. అతను నిరాకరించాడు.

దాంతో మాథ్యూస్ కోపంగా పెవిలియన్ చేరాడు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది చాలా అన్యాయమని మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షకీబ్ అల్ హసన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని మండిపడ్డారు.

అయితే అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కొత్త పంచాయితీకి తెరలేపింది. నిర్ణీత 2 నిమిషాల సమయం ముగియక ముందే మాథ్యూస్‌ను ఔటిచ్చారని టైమర్‌తో సహా సూచించింది. దీంతో అంపైర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త అంపైరింగ్ అంటూ మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ తీరుతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న మాథ్యూస్.. ఆ జట్టు బ్యాటింగ్ సందర్భంగా తన నోటికి పనిచెప్పాడు.

బ్రేక్ సమయంలో ఆ జట్టు బ్యాటర్ల దగ్గరకు వెళ్లి టైమ్ వృథా చేయవద్దని, ఔటిస్తారని వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులు చేసింది. చరిత్ అసలంక (105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 108) శతక్కొట్టగా.. పాతుమ్ నిస్సంక(36 బంతుల్లో 8 ఫోర్లతో 41), సదీర సమరవిక్రమా(42 బంతుల్లో 4 ఫోర్లతో 41) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్(3/80) మూడు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్ రెండేసి వికెట్లు తీసారు. మెహ్‌దీ హసన్ మీరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Monday, November 6, 2023, 20:09 [IST]
Other articles published on Nov 6, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+