BAN vs SL: నో బాల్స్‌తో గెలిచే మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్.. సూపర్ 4కు శ్రీలంక! మరోసారి నాగినీ డ్యాన్స్‌తో రచ్చ

దుబాయ్: ఆసియాకప్ 2022లో శ్రీలంక జట్టు సూపర్-4లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక సమష్టి ప్రదర్శనతో రాణించి 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ పోరు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇక సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మెహిదీ హసన్ మీర్జా (26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), అఫిఫ్ హోస్సెన్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మొసాద్దేక్ హోస్సెన్(9 బంతుల్లో 4 ఫోర్లు 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. లంక బౌలర్లలో హసరంగా, కరణరత్నే రెండేసి వికెట్లు తీయగా.. దిల్లాన్, మహీశ్ తీక్షణ, ఫెర్నాండో తలో వికెట్ పడగొట్టారు.

మెరిసిన మెండీస్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కుశాల్ మెండీస్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీ చేయగా.. డసన్ షనక(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టెయిలండర్లు సైతం విలువైన పరుగులు చేయడంతో ఆ జట్టు విజయాన్నందుకుంది. ముఖ్యంగా ఫెర్నాండో(10 నాటౌట్) విజయం కావాల్సిన పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో ఎబడాట్ హోస్సెన్ మూడు వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్ రెండు పడగొట్టాడు. ముస్తాఫిర్ రెహ్మాన్, మెహ్‌దీ హసన్ చెరొక వికెట్ పడగొట్టారు.
శుభారంభం..
184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకు ఓపెనర్లు పాతుమ్ నిస్సంక(20), కుశాల్ మెండీస్ శుభారంభం అందించారు. 45 పరుగులు జోడించిన అనంతరం తొలి వికెట్‌గా నిస్సంక వెనుదిరిగాడు. ఎబడాట్ హోస్సెన్ వేసిన ఆరో ఓవర్‌లో అతను క్యాచ్ ఔటయ్యాడు. ఇక అదే ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన అసలంక(1) ఔటవ్వడంతో పవర్ ప్లే ముగిసేసరికి లంక 2 వికెట్ల నష్టానికి 48 రన్స్ చేసింది. ఇక తన మరుసటి ఓవర్‌లో ఎబడాట్ హోస్సెన్.. దనుష్క తిలక(11)ను ఔట్ చేశాడు.

గెలిచే మ్యాచ్‌లో..
ఆ తర్వాత భానుక రాజపక్సను టస్కిన్ అహ్మద్ ఔట్ చేయగా.. కుశాల్ మెండీస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక అతన్ని ముస్తాఫిజుర్ రెహ్మాన్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన వానిందు హసరంగా(2)ను టస్కిన్ అహ్మద్ ఔట్ చేయగా.. కెప్టెన్ డసన్ షనక ఒంటరి పోరాటం చేశాడు. అయితే మెహ్‌దీ హసన్ అతన్ని క్యాచ్ ఔట్ చేయడంతో లంక విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్‌లో 16 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమయ్యాయి.
చివరి ఓవర్‌లో నో బాల్ వేసిన బంగ్లాదేశ్ మూల్యం చెల్లించుకుంది. ఫెర్నాండో రెండు బౌండరీలు బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో లంక బౌలర్లు నాగినీ డ్యాన్స్ చేసి బంగ్లాపై ప్రతీకారం తీర్చుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications