T20 World Cup 2021: గొడవలు షురూ... కొట్టుకోవడానికి సిద్దమైన బంగ్లా, శ్రీలంక క్రికెటర్! (వీడియో)

షార్జా: టీ20 ప్రపంచకప్ సూపర్-12 ప్రారంభమై రెండు రోజులు కాలేదు. అప్పుడే ఆటగాళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. తాజాగా బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకోవడానికి సిద్దమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్ లాహిరు కుమారా, బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ మధ్య తీవ్ర మాటల యుద్దం నడిచింది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడం గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో లాహిరు కుమారా వేసిన ఐదో బంతిని లిటన్ దాస్ మిడాఫ్ దిశగా ఆడగా.. ఆ దిశలో సర్కిల్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షనక అద్భుతంగా అందుకున్నాడు. ఈ వికెట్ తీసిన ఆనందంలో లాహిరు కుమారా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. అతని అరుపులపై లిటన్ దాస్ అభ్యంతం వ్యక్తం చేయడంతో ఆగ్రహానికి గురైన లాహిరు కుమార్ అతనిపైకి దూసుకెళ్లాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన లిటన్ దాస్ నోటికి పనిచెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టేసుకునే వరకు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అంపైర్లు, సహచర ఆటగాళ్లు ఇద్దరి ఆటగాళ్లను వారించి పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.
అయితే ఈ ఇద్దరి మధ్య నెలకొన్న వాగ్వాదంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు అరుస్తున్నావ్? రా అని లిటన్ దాస్ అంటే మూసుకొని పోవయ్యా అంటూ లాహిరు అన్నాడని ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 87 రన్స్ చేసింది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్(14 బ్యాటింగ్), మమహ్మద్ నయిమ్(45 బ్యాటింగ్) ఉన్నారు. లిటన్ దాస్(16)తో పాటు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(10) విఫలమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications