Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అబ్బబ్బా.. ఇలాంటి ఫీల్డింగ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..!(వీడియో)

క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగైన ఓ అరుదైన ఘటన అందర్నీ ఆకట్టుకుంటోంది. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక బ్యాటర్ కొట్టిన బంతిని ఆపేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు ఫీల్డర్లు పరుగెత్తడం చర్చనీయాంశమైంది.

ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్లిప్ ఫీల్డర్లతో పాటు గల్లీ ఫీల్డర్ కూడా బంతిని ఆపేందుకు పరుగెత్తారు. చివరకు గల్లీ ఫీల్డర్ బంతిని ఆపి తన వెనుకాలే వచ్చిన థర్డ్ స్లిప్ ఫీల్డర్‌కు అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహముద్ వేసిన 21వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

BAN vs SL Five Bangladesh Fielders Chase One Ball to Stop it From Crossing Boundary Videos Goes viral

ఈ ఓవర్ రెండో బంతిని హసన్ మహముద్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. జయసూర్య థర్డ్ మ్యాన్ వైపు షాట్ ఆడాడు. దాంతో బంగ్లా ఫీల్డ్ సెటప్ మొత్తం కదిలింది. చూడటానికి చాలా ఫన్నీగా ఉన్న ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. 'అబ్బబ్బా.. ఇలాంటి ఫీల్డింగ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్!'అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

ఈ మ్యాచ్‌పై శ్రీలంక పట్టుబిగించింది. ఇప్పటికే 455 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 25 ఓవర్లలో 6 వికెట్లకు 106 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 531 పరుగుల భారీ స్కోర్ చేసింది. దిముత్ కరుణరత్నే(86), కుశాల్ మెండిస్(93), కామిందు మెండిస్(92 నాటౌట్) తృటిలో శతకాలు చేజార్చుకోగా.. నిషాన్ మధుశంక(57), దినేశ్ చండీమల్(59) హాఫ్ సెంచరీలతో రాణించారు.

అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగులకే కుప్పకూలింది. అసితా ఫెర్నాండో(4/34) బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. జకీర్ హసన్(54) మినహా అంతా విఫలమయ్యారు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన శ్రీలంక.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది.

Story first published: Monday, April 1, 2024, 18:37 [IST]
Other articles published on Apr 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+