BAN vs SL: శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం.. హై డ్రామాకు తెర!
BAN vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. వరుసగా 6 పరాజయాల తర్వాత శ్రీలంకపై గెలుపొందింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్.. ఊరట విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్రీలంక సైతం సెమీస్ రేసు నుంచి తప్పుకోగా.. ఆ జట్టుకు ఇది ఆరో పరాజయం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులు చేసింది. చరిత్ అసలంక (105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 108) శతక్కొట్టగా.. పాతుమ్ నిస్సంక(36 బంతుల్లో 8 ఫోర్లతో 41), సదీర సమరవిక్రమా(42 బంతుల్లో 4 ఫోర్లతో 41) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్(3/80) మూడు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్ రెండేసి వికెట్లు తీసారు. మెహ్‌దీ హసన్ మీరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలోనే 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. నజ్ముల్ హొస్సెన్ షాంటో(101 బంతుల్లో 12 ఫోర్లతో 90), షకీబ్ అల్ హసన్(65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో మదుషంక మూడు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ, మాథ్యూస్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా వెనుదిరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. షకీబ్ అల్ హసన్ వేసిన 25వ ఓవర్‌లో ఈ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ రెండో బంతికి సదీర సమరవిక్రమా క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే గార్డ్ తీసుకునే సమయంలో అతని హెల్మెట్ స్ట్రిప్ ఊడిపోయింది. దాంతో అతను బంతిని ఆడకుండా మరో హెల్మెట్ తీసుకురావాలని తమ డగౌట్ వైపు చూపించాడు. బంతి ఎదుర్కోకుండా హెల్మెట్ కోసం వేచి చూసాడు.
అప్పటికే నిర్ణీత సమయం సమయం ముగియడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ అప్పీల్ చేశాడు. అంపైర్ నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను ఔటిచ్చాడు. మాథ్యూస్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. షకీబ్‌ను కన్విన్స్ చేయాలని వారు అతనికి సూచించారు. షకీబ్ మాత్రం తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడు. దాంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఈ ఘటనతో ఇరు జట్ల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. కానీ బంగ్లాదేశ్ విజయంతో ఈ హైడ్రామాకు తెరదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications