BAN vs SL: శతక్కొట్టిన అసలంక.. బంగ్లా ముందు భారీ లక్ష్యం!
BAN vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ చరిత్ అసలంక (105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 108) శతక్కొట్టాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(36 బంతుల్లో 8 ఫోర్లతో 41), సదీర సమరవిక్రమా(42 బంతుల్లో 4 ఫోర్లతో 41) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్(3/80) మూడు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్ రెండేసి వికెట్లు తీసారు. మెహ్‌దీ హసన్ మీరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా వెనుదిరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. షకీబ్ అల్ హసన్ వేసిన 25వ ఓవర్‌లో ఈ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ రెండో బంతికి సదీర సమరవిక్రమా క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే గార్డ్ తీసుకునే సమయంలో అతని హెల్మెట్ స్ట్రిప్ ఊడిపోయింది. దాంతో అతను బంతిని ఆడకుండా మరో హెల్మెట్ తీసుకురావాలని తమ డగౌట్ వైపు చూపించాడు. బంతి ఎదుర్కోకుండా హెల్మెట్ కోసం వేచి చూసాడు.
అప్పటికే నిర్ణీత సమయం సమయం ముగియడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ అప్పీల్ చేశాడు. అంపైర్ నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను ఔటిచ్చాడు. మాథ్యూస్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. షకీబ్‌ను కన్విన్స్ చేయాలని వారు అతనికి సూచించారు. షకీబ్ మాత్రం తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడు. దాంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.
క్రికెట్ చరిత్రలోనే టైమ్ ఔటైన బ్యాటర్‌గా మాథ్యూస్ చరిత్రకెక్కాడు. మాథ్యూస్ అనైతికంగా వెనుదిరిగినా.. చరిత్ అసలంక చెలరేగాడు. ధనుంజయ డిసిల్వా సాయంతో 6వ వికెట్‌కు 78 పరుగులు.. మహీష్ తీక్షణ సాయంతో ఏడో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే అతను 101 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మాథ్యూస్ వికెట్‌తో ఈ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇరు జట్లు విజయం కోసం కసిగా ఆడుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications